హానర్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్లు…

honorముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్లు హానర్ 20, హానర్ 20 ప్రొలను ఇండియన్ మార్కెట్‌లో మంగళవారం రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలోనూ 6.26 ఇంచుల డిస్‌ప్లేను అమర్చారు. హీట్‌ను తట్టుకోవడానికి హానర్ 20 ప్రొ ఫోన్‌లో ప్రత్యేకంగా గ్రాఫీన్ కూలింగ్ షీట్ టెక్నాలజీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫోన్లకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది సంస్థ. వీటికి వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేసింది.

అలాగే ఈ రెండు ఫోన్లలోనూ హానర్ సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ వంటి అద్భుత ఫీచర్‌ను అందిస్తున్నారు. హానర్ 20 ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ కలర్స్ లో రిలీజ్ చేసింది. హానర్ 20 ఫోన్‌ రూ.32,999, హానర్ 20 ప్రొ ఫోన్‌ను రూ.39,999 ధరకు కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్‌ సైట్ లో జూన్ 25 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్లను కొన్న జియో వినియోగదారులకు ఆ కంపెనీ 2.2 టిబి డేటాను ఫ్రీగా ఇస్తుంది. ఈ ఫోన్లను నో కాస్ట్ ఇఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చు. వీటికి 90 రోజుల కాలవ్యవధి గల 90 శాతం బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్‌ను హువావే అందిస్తోంది.

హానర్ 20, హానర్ 20 ప్రొ అద్భుత ఫీచర్లు…

6.26 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్,

128 జిబి స్టోరేజ్ (హానర్ 20), 8 జిబి ర్యామ్,

256 జిబి స్టోరేజ్ (హానర్ 20 ప్రొ), ఆండ్రాయిడ్ 9.0 పై,

డ్యుయల్ సిమ్, హానర్ 20 ప్రొ – 48, 16, 8, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు,

హానర్ 20 – 48, 16, 2, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు,

32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3డి పోర్ట్రెయిట్ లైటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,

యుఎస్‌బి టైప్ సి ఆడియో, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0 ఎల్‌ఇ, యుఎస్‌బి టైప్ సి,

హానర్ 20 – 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, హానర్ 20 ప్రొ – 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, హానర్ సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లలో ఉన్నాయి.

Honor 20 has been launched in India

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హానర్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.