హాంకాంగ్‌లో మళ్లీ భారీ నిరసనలు

  వివాదాస్పద రైల్వే స్టేషన్ వద్ద ప్రదర్శనలు హాంకాంగ్: వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు ఆదివారం హాంకాంగ్‌లో ప్రదర్శన నిర్వహించా రు. నగరంలో చైనా అనుకూల నాయకులపై వత్తిడి తెచ్చేందుకు చైనా ప్రధాన భూభాగంతో కలిపే వివాదాస్పదమైన రైల్వే స్టేషన్ దగ్గర ఈ ప్రదర్శన జరిగింది. గత సోమవారం యువత కనీవినీ ఎరగని రీతిలో పార్లమెంట్‌ను ముట్టడించిన తర్వాత జరిగిన అతిపెద్ద మొదటి ప్రదర్శన ఇది. ఇది నగరాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. నేరస్థుల్ని చైనాకు […] The post హాంకాంగ్‌లో మళ్లీ భారీ నిరసనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వివాదాస్పద రైల్వే స్టేషన్ వద్ద ప్రదర్శనలు

హాంకాంగ్: వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు ఆదివారం హాంకాంగ్‌లో ప్రదర్శన నిర్వహించా రు. నగరంలో చైనా అనుకూల నాయకులపై వత్తిడి తెచ్చేందుకు చైనా ప్రధాన భూభాగంతో కలిపే వివాదాస్పదమైన రైల్వే స్టేషన్ దగ్గర ఈ ప్రదర్శన జరిగింది. గత సోమవారం యువత కనీవినీ ఎరగని రీతిలో పార్లమెంట్‌ను ముట్టడించిన తర్వాత జరిగిన అతిపెద్ద మొదటి ప్రదర్శన ఇది. ఇది నగరాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. నేరస్థుల్ని చైనాకు అప్పగించాలని ప్రభుత్వం చేసిన వివాదాస్పదమైన ప్రతిపాదనకు వ్యతిరేకంగా నెలరోజుల నుంచీ హాంకాంగ్ భారీ ప్రదర్శనలతోనూ, పోలీసులకు ఆందోళనకారులకు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘర్షణలతోనూ అట్టుడికిపోతోంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో బిల్లు వాయిదా పడింది. కానీ ఆ చర్య ప్రజల ఆగ్రహాన్ని ఏమాత్రం చల్లార్చలేకపోయింది.

ఆదివారం మధ్యాహ్నం సిమ్ షా సుయి పార్క్ వద్ద ప్రారంభమైన ర్యాలీలో వేలాదిమంది పాల్గొన్నారు. ఇక్కడికి చైనా యాత్రికులు చాలామంది వస్తుంటారు. నగరంలో ఉన్న చైనా వాసులకు తాము ఎందుకు ప్రతిఘటిస్తున్నామో తెలిపేందుకు నిర్వాహకులు ఈ ర్యాలీని ఒక అవకాశంగా తీసుకున్నారు. బిల్లును పూర్తి గా రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రదర్శనల సందర్భంగా పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంపై దర్యాప్తు జరగాలని, అరెస్టయిన వారిపట్ల ఉదారంగా వ్యవహరించాలని, ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోని నాయకురాలు కారీ లామ్ పదవి నుంచి తప్పుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉండగా, హాంకాంగ్ ప్రదర్శనల సమాచారాన్ని చైనాలో సెన్సార్ చేస్తున్నారు. ప్రజా ఉద్యమాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు. దేశీ నిధులతో కొందరు మాతృభూమిని అస్థిరపరిచేందుకు హింసకు పాల్పడుతున్నారని చైనాలో ప్రచారం జరుగుతోంది.

Hong Kong Protesters Reach Out to Chinese Tourists

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హాంకాంగ్‌లో మళ్లీ భారీ నిరసనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.