హాంగ్‌కాంగ్ ఎన్నికలు ఏడాది వాయిదా

Hong Kong postpones elections for a year over virus

 

హాంగ్‌కాంగ్: చాలాకాలంగా అంతా ఎదురుచూస్తున్న హాంగ్‌కాంగ్ పార్లమెంట్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ కారణంగా ఈ ఎన్నికలను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు హాంగ్‌కాంగ్ నేత క్యారీ ల్యామ్ ప్రకటించారు. హాంగ్‌కాంగ్ పాక్షిక అటానమీతో కూడిన చైనా నగరంగా ఉంది. ఇక్కడ చైనా ఆధిపత్యానికి నిరసనగా ప్రజా ప్రదర్శనలు ఉవ్వేత్తున చెలరేగాయి. హింసాకాండ కూడా చోటుచేసుకుంది.

హాంగ్‌కాంగ్‌లో లెజిస్లేటివ్ సభకు ఎన్నికలు చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుత దశలో ఎన్నికల నిర్వహణ కుదరదని ల్యామ్ స్పష్టం చేశారు. ఎన్నికల వాయిదాకు సంబంధించి తమ ప్రభుత్వం అత్యవసర ఆర్డినెన్స్‌ను వెలువరిస్తుందని వివరించారు. వచ్చే ఏడాది సెప్టెంర్ 5వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉంటుందని, ఇందుకు చైనా ప్రభుత్వం నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని తెలిపారు.

Hong Kong postpones elections for a year over virus

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post హాంగ్‌కాంగ్ ఎన్నికలు ఏడాది వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.