ఇంట్లో ఉండి పని చేస్తున్నారా?

  ఇంటి నుంచి ఆఫీసు పని చేసేవారు కొన్ని పద్ధతులను పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అనుకున్నంత సులభం కాదు ఇంటి వద్ద ఆఫీసు పనిచేయడం. ముఖ్యంగా మహిళలు ఈ విధానాన్ని ఎంచుకున్నప్పుడు విజయం సాధించేందుకు కొన్ని విధానాలు పాటించాలి. అవేంటో చూద్దాం.. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వేగంగా విస్తరిస్తోంది. కంపెనీలు కూడా ‘ఫ్లెక్సిబుల్ వర్క్’ ఆప్షన్లు ఇస్తున్నాయి. దీంతో సౌకర్యం, సమయాన్ని బట్టి పని చేసుకునే వీలుంటుంది. కానీ ఇంట్లో కూర్చుని పని చేయడం […] The post ఇంట్లో ఉండి పని చేస్తున్నారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇంటి నుంచి ఆఫీసు పని చేసేవారు కొన్ని పద్ధతులను పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అనుకున్నంత సులభం కాదు ఇంటి వద్ద ఆఫీసు పనిచేయడం. ముఖ్యంగా మహిళలు ఈ విధానాన్ని ఎంచుకున్నప్పుడు విజయం సాధించేందుకు కొన్ని విధానాలు పాటించాలి. అవేంటో చూద్దాం..

ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వేగంగా విస్తరిస్తోంది. కంపెనీలు కూడా ‘ఫ్లెక్సిబుల్ వర్క్’ ఆప్షన్లు ఇస్తున్నాయి. దీంతో సౌకర్యం, సమయాన్ని బట్టి పని చేసుకునే వీలుంటుంది. కానీ ఇంట్లో కూర్చుని పని చేయడం విషయానికి వస్తే, మన మెదడులో అన్నింటికంటే ముందు ఒకటే జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు మనసు పడితే అప్పుడు చేద్దాం. మనసు చెప్పినట్టుగా పని చేయడం, ఇక్కడ ఎవరూ ఆపే వాళ్లుగానీ, వద్డనే వాళ్లు కానీ ఉండరు. చేద్దాంలే అని అనుకుని బద్ధకించారంటే అంతే సంగతులు. ఇలా ఆలోచిస్తూ పనిచేస్తే కొంత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఒత్తిడి లేకుండా సరైన పద్ధతిలో పని చేస్తే విజయం సాధించినట్లే. ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ వర్క్ ఎటికేట్స్‌పై తప్పకుండా దృష్టి పెట్టుకోండి.

1. పని ప్రణాళిక ముఖ్యం: వర్క్ షెడ్యూల్ పెట్టుకుంటే పనిచేయడం సులభం. ఇంట్లో నుంచి పని చేస్తున్న సమయంలో ఏదైనా సరే రాసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ తర్వాత దాన్ని వెతకడంలో మీ సమయం వృథా అవుతుంది. నష్టం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వర్క్ షెడ్యూల్ పెట్టుకోవాలి. అప్పుడే ఏ పని పూర్తి చేయాలన్నది తెలుస్తుంది. ఏమేం పూర్తి చేశామో, ఇంకా పూర్తి చేయాల్సినవి ఏమేం ఉన్నాయో అవగాహన ఉంటుంది. ఇలా చేస్తే చాలా తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలరు.
2. నియమిత వేళలు : అదేపనిగా లేవకుండా కూర్చొని పని చేయకూడదు. దీంతో ఆరోగ్యం విషమిస్తుంది. అప్పుడు మీ పని కూడా ప్రభావితమవుతుంది. కాబట్టి పని చేయడంతోపాటు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి పనివేళలను సిద్ధం చేసుకోవాలి. తర్వాత వాటికి అనుగుణంగా పనిచేయాలి. ఇలా చేస్తే మీరు సరైన పద్ధతిలో పని పూర్తి చేయడంతోపాటు పనిని ఆస్వాదిస్తారు.
3. క్రమశిక్షణ పాటించండి : పని చేసే సమయంలో చాటింగ్, ఫోన్ మాట్లాడటం వంటివి చేయొద్దు. క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే మీరు చేసే పనిలో క్రమశిక్షణ పాటించకపోతే మీరు ది బెస్ట్‌గా అవ్వలేరు. ఈ విషయం మీ స్నేహితులకు, బంధువులకు కూడా చెప్పాలి. అప్పుడు వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ పనిలో ఉన్నప్పుడు భంగం కలిగించరు.
4. పని సమయానికి పూర్తి చేయండి : ఏదో వంక పెట్టుకుని పని వాయిదా చేయకూడదు. ఇలా చేస్తే మీ ప్రతిభ మరుగున పడిపోతుంది. కాబట్టి సమయానికి పని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. దీంతో పని వేగంగానూ అవుతుంది. మీరు ఆందోళన లేకుండా ఉండొచ్చు.
5. ఫీల్డ్‌లో ఉన్న వారితో కలిసి ఉండాలి : మీరు ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చొనే పని చేస్తుంటారు. అప్పుడు మీ ఫీల్డ్‌కి సంబంధించిన వారితో సంబంధాలు పెట్టుకోండి. అప్పుడు వారి నుండి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది.

Home office workers must follow certain procedures

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంట్లో ఉండి పని చేస్తున్నారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: