పోలీసు బాసులతో హోంమంత్రి భేటి

  హైదరాబాద్ : పోలీసు శాఖ మరింత పటిష్టత, బలోపేతం కోసం 2019, 2020 బడ్జెట్ అవసరమయ్యే నిధులపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ ఆలీ రాష్ట్ర డిజిపి, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో శుక్రవారం భేటి అయ్యారు. పోలీసుశాఖలో జరుగుతున్న నిర్మాణాలు, బిల్లులు, పెండింగ్ బిల్లులపై మంత్రి ఆయా విభాగాధిపతులతో చర్చించారు. ఇందులో భాగంగా పోలీసు శాఖకు అవసరమయ్యే నిధులు తదితర అంశాలపై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి, ఇతర […] The post పోలీసు బాసులతో హోంమంత్రి భేటి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : పోలీసు శాఖ మరింత పటిష్టత, బలోపేతం కోసం 2019, 2020 బడ్జెట్ అవసరమయ్యే నిధులపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ ఆలీ రాష్ట్ర డిజిపి, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో శుక్రవారం భేటి అయ్యారు. పోలీసుశాఖలో జరుగుతున్న నిర్మాణాలు, బిల్లులు, పెండింగ్ బిల్లులపై మంత్రి ఆయా విభాగాధిపతులతో చర్చించారు.

ఇందులో భాగంగా పోలీసు శాఖకు అవసరమయ్యే నిధులు తదితర అంశాలపై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు ఒక్కో విభాగ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డిసిపి, ఎస్‌పిఎఫ్ తేజ్‌దీప్‌కౌర్ మీనన్, ఎస్‌పిఎ డైరెక్టర్ సంతోష్‌మిశ్రా, ఎడిజి ఎసిఎస్ రవిగుప్త, జైళ్ల శాఖ ఎడిజి సందీప్ శాండిల్యా, హైదరాబాద్, రాచంకొండ, సైబరాబాద్ సిపిలు అంజనీకుమార్, మహేశ్‌భగవత్, సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

Home Minister is Review with the Police Chiefs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పోలీసు బాసులతో హోంమంత్రి భేటి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: