రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

రంగారెడ్డి: జిల్లాలోని ఆగపల్లి గేట్ సమీపంలో సాగర్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు ఐలయ్య(35) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఐలయ్య ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఐలయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. […] The post రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి: జిల్లాలోని ఆగపల్లి గేట్ సమీపంలో సాగర్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు ఐలయ్య(35) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఐలయ్య ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఐలయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాము పెద్దదిక్కుని కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు

Home Guard Died in Road accident At Rangareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: