హోలి

  పూలు కొన్ని ప్రయాణాలు/పూలు కొన్ని పరిచయాలు పూలు కొన్ని స్నేహాలు/ అల్లుకునేది ఉత్తదారమే అయితే/ అది వాసన/ తెరచుకున్నది హృదయ ద్వారం అయినప్పుడు/ అది పరిమళం పూలు కొన్ని ఊహలు/ పూలు కొన్ని ఊసులు/ పూలు కొన్ని జీవనాడులు రాసేది ఉత్తసిరా మాత్రమే అయితే/ అది లిపి రాపిడయ్యేది సప్తవర్ణాల సంవేదన అయినప్పుడు/ అది ఇంద్రధనుస్సు పూలు కొన్ని చోట్లు/ పూలు కొన్ని సమ్మేళనాలు/ పూలు కొన్ని సాయంత్రాలు/ మాట్లాడేవి ఉత్తగొంతులు మాత్రమే అయితే/ అది […] The post హోలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పూలు కొన్ని ప్రయాణాలు/పూలు కొన్ని పరిచయాలు పూలు కొన్ని స్నేహాలు/ అల్లుకునేది ఉత్తదారమే అయితే/ అది వాసన/ తెరచుకున్నది హృదయ ద్వారం అయినప్పుడు/ అది పరిమళం పూలు కొన్ని ఊహలు/ పూలు కొన్ని ఊసులు/ పూలు కొన్ని జీవనాడులు రాసేది ఉత్తసిరా మాత్రమే అయితే/ అది లిపి రాపిడయ్యేది సప్తవర్ణాల సంవేదన అయినప్పుడు/ అది ఇంద్రధనుస్సు పూలు కొన్ని చోట్లు/ పూలు కొన్ని సమ్మేళనాలు/ పూలు కొన్ని సాయంత్రాలు/ మాట్లాడేవి ఉత్తగొంతులు మాత్రమే అయితే/ అది రచ్చబండ/ మథించేవి మహాత్యాగాలు అయినప్పుడు/ అది సూర్యమండలం పూలు కొన్ని సందర్భాలు/పూలు కొన్ని సందేశాలు/ పూలు కొన్ని సంజాయిషీలు/ ఒప్పుకునేది ఉత్త ఉదాహరణల గురించే అయితే/ అది జ్ఞాపకం/ ఒడిసి పట్టుకునేది జన్మజన్మల తాత్పర్యం అయినప్పుడు/ అది జ్యోతిస్సీమ ఆర్తికవి అన్నట్టు / పూలు కొన్ని విచారాలు/ పూలు కొన్ని విషాదాలు/ పూలు కొన్ని నిషేధాలు/ ఏడ్పు ఉత్తకళ్ళ కోసమే అయితే/ అవి నీళ్ళు/దుఃఖం బంధాల పెద్దకలశం అయినప్పుడు/ అవి కన్నీళ్ళు ముండ్లు దిగి కూలబడ్డ స్థలమే/ శక్తి కుండలి/ ఊపిరాడక వేసారిన కవోష్ణప్రదేశమే/ ముక్తి దాయిని పిల్ల పిడుగులెవరో/ ఆశల జెండాలు మోస్తూ పిచ్‌కారీ వేగంతో/ రంగులు రంగులుగా ఇటువైపే వస్తున్నారు/ కాసిన్ని సదాశయలను/ వాండ్ల నిప్పుకవాతుకు జతచేద్దాం పద.

                                                                                – డా. బెల్లి యాదయ్య, 9848392690

Holi is a popular ancient Hindu festival

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హోలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: