ధర్మారంలో హైటెక్ వ్యభిచారం?

Transgender

 

కరీంనగర్ : ధర్మారంలో ఓ హైటెక్ వ్యభిచారం వ్యవహారం తీవ్ర చర్చనీమైంది. అంగ మార్పిడి ద్వారా మహిళగా మారిన ఓ పురుషుడు వ్యభిచారం పేరిట పలువురు యువకులకు వలవేసి లక్షల్లో వసూలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. బొమ్మరెడ్డిపల్లి, ధర్మారంకు చెందిన పలువురు యువకుల నుంచి లక్షల్లో వసూలు చేయడంతో వారు లబోదిబోమంటున్నారు. విద్యావంతుడైన ఓ యువకుడు కొద్ది మాసాల క్రితం వరకు కొత్తూర్ గ్రామంలో నివాసముండేవాడు.

అయితే సదరు యువకుడు అంగ మార్పిడి ద్వారా మహిళగా మారాడు. అనంతరం ధర్మారం మండల కేంద్రంలోనే నివాసముంటూ హైటెక్ వ్యభిచారం పేరిట యువకులకు వలలో వేసి లక్షలు వసూలు చేయడం జరిగింది. ఈ ఉదంతం మోసపోయిన యువకుల కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు పాలుపోని స్థితిలో పడిపోయారు. ఈ విషయమై ఎస్‌ఐ కె. ప్రేమ్‌కుమార్‌ను వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి రాలేదని, బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Hightech prostitution in Dharmaram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ధర్మారంలో హైటెక్ వ్యభిచారం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.