రజకుడి శవయాత్రను అడ్డుకున్న ఇతర కులస్తులు

  మన తెలంగాణ/కొల్చారం : మాయమైపోతున్నడమ్మా… మనిషన్న వాడు… అనే విధంగా ఆధునిక యుగంలో ఇంకా కులాలు, మతాలు, హెచ్చుతగ్గుల స్వార్థ్ధాల కారణంగా మనిషి చనిపోయినా స్మశానానికి తీసుకెళ్లేందుకు ఇరుగుపొరుగు వారే అడ్డుగోడలుగా నిలిచిన సంఘటన మండల పరిధిలోని చిన్నఘనపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రజకుడైన చాకలి మల్లయ్య గుండెపోటుతో మరణించాడు. అతని దహన సంస్కారాలను నిర్వహించేందుకు ఇంటి నుండి శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు దారి ఉన్నప్పటికీ మా ఇంటి నుండి ముందు […] The post రజకుడి శవయాత్రను అడ్డుకున్న ఇతర కులస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/కొల్చారం : మాయమైపోతున్నడమ్మా… మనిషన్న వాడు… అనే విధంగా ఆధునిక యుగంలో ఇంకా కులాలు, మతాలు, హెచ్చుతగ్గుల స్వార్థ్ధాల కారణంగా మనిషి చనిపోయినా స్మశానానికి తీసుకెళ్లేందుకు ఇరుగుపొరుగు వారే అడ్డుగోడలుగా నిలిచిన సంఘటన మండల పరిధిలోని చిన్నఘనపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రజకుడైన చాకలి మల్లయ్య గుండెపోటుతో మరణించాడు. అతని దహన సంస్కారాలను నిర్వహించేందుకు ఇంటి నుండి శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు దారి ఉన్నప్పటికీ మా ఇంటి నుండి ముందు నుండి, మా ఇంటి వెనుక నుండి శవాన్ని తీసుకెళ్లరాదని పక్కపక్కనే ఉన్న ఇంటి యజమానులు అడ్డుకున్నారు.

దీంతో జిల్లా రజక సంఘం నాయకులు జోక్యంతో సమస్య పరిష్కరించడానికి స్థానిక సర్పంచ్, ఎస్సైతోపాటు తహసీల్దార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతుడు చాకలి మల్లయ్య కుటుంబీకులు వేరే దారి చూపడంతో ఆ దారిలో ముళ్లపొదలను, మట్టి కుప్పలపై నుండి అనేక ఇబ్బందులు పడుతూ శవయాత్రను నిర్వహించారు. ఊరి ప్రజల కోసం ఊరి బాగుకోసం తన జీవిత కాలమంతా కులవృత్తిలో భాగంగా అనేక సేవలందించిన మల్లయ్యకు ఈ విధంగా ఇరుగుపొరుగు వారు అడ్డుచెప్పడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.

మానవత్వం మంట కలిసే విధంగా వ్యవహరించిన ఇరుగుపొరుగు వారిపై పలువురు ఆగ్రహించారు. రజకులను కించపర్చే విధంగా వ్యవహరిస్తున్నా ప్రజాప్రతినిధులు మాత్రం తమను పట్టించుకోవడం లేదని రజక సంఘం నాయకులు అన్నారు. ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలని, మనిషిని మనిషిగా చూడాలే తప్ప కించపర్చడం ఎంతవరకు సమంజసమని వారన్నారు. మల్లయ్య మృతి పట్ల వారు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

Higher Caste People against on Rajaka Caste Funeral

 

The post రజకుడి శవయాత్రను అడ్డుకున్న ఇతర కులస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: