దళిత మహిళ సర్పంచ్ పై దాడి

  రంగారెడ్డి: గర్భిణీ అయిన  దళిత మహిళ సర్పంచ్‌పై దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోనాల పండుగ సందర్భంగా సర్పంచ్ పవిత్ర బోనం సమర్పించడానికి అమ్మవారి గుడికి వచ్చింది. దీంతో అగ్ర కులానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆమెను కించపరిచాడు. మాదిగ కులానికి చెందిన వ్యక్తులు గుడిలోకి రావద్దని కొబ్బరి కాయలు దేవునికి సమర్పించవద్దని కాంగ్రెస్ నేత ప్రభాకర్ రెడ్డి, జయేందర్ […] The post దళిత మహిళ సర్పంచ్ పై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారెడ్డి: గర్భిణీ అయిన  దళిత మహిళ సర్పంచ్‌పై దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోనాల పండుగ సందర్భంగా సర్పంచ్ పవిత్ర బోనం సమర్పించడానికి అమ్మవారి గుడికి వచ్చింది. దీంతో అగ్ర కులానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆమెను కించపరిచాడు. మాదిగ కులానికి చెందిన వ్యక్తులు గుడిలోకి రావద్దని కొబ్బరి కాయలు దేవునికి సమర్పించవద్దని కాంగ్రెస్ నేత ప్రభాకర్ రెడ్డి, జయేందర్ రెడ్డి, మారుతీ రెడ్డి, నరేందర్ రెడ్డి, రామ్ రెడ్డి హెచ్చరించారు. మహిళ సర్పంచ్‌ ను రెడ్డి వర్గానికి చెందిన వీళ్లు అసభ్యపదజాలంతో తిట్టారు. దీంతో సర్పంచ్ భర్త వీళ్లతో వాగ్వాదానికి దిగాడు.  సర్పంచ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిపై 323, 504 యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. రామ్ రెడ్డి, సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చర్లపలి జైలుకు తరలించామని ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ రెడ్డి తెలిపారు. ప్రభాకర్ రెడ్డి చెందిన అనుచరిడిపై టిఆర్ఎస్ పార్టీ నుంచి పవిత్ర గెలవడంతో ఆమెపై ప్రభాకర్ రెడ్డి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని గ్రామస్థులు వాపోతున్నారు. 

 

Higher Caste Attack on Pregnant Dalit Women in Rangareddy

The post దళిత మహిళ సర్పంచ్ పై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.