బిందు సేద్యంకై రైతన్న ఆసక్తి…

  షాద్‌నగర్‌ : వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు ధీటుగా అన్ని వర్గాల రైతులు బిందు సేద్యంవైపు అశగా ఎదురు చూస్తున్నారు. అన్నదాతలు సాధారణ సాగుకు స్వస్తి చెప్పి సూక్ష్మసేద్యంవైపు ఎక్కువగా శ్రద్ద కనబర్చుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పోందాలనే సంకల్పంతో రైతులు బిందు సేద్యంపై పట్టు సాధిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అడుగంటిన భూగర్బ జలాలు అధిగమించేందుకు ఉన్న కొద్దిపాటి నీటి వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు స్థానిక రైతులు బిందుసేద్యంవైపు మొగ్గు […] The post బిందు సేద్యంకై రైతన్న ఆసక్తి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

షాద్‌నగర్‌ : వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు ధీటుగా అన్ని వర్గాల రైతులు బిందు సేద్యంవైపు అశగా ఎదురు చూస్తున్నారు. అన్నదాతలు సాధారణ సాగుకు స్వస్తి చెప్పి సూక్ష్మసేద్యంవైపు ఎక్కువగా శ్రద్ద కనబర్చుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పోందాలనే సంకల్పంతో రైతులు బిందు సేద్యంపై పట్టు సాధిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అడుగంటిన భూగర్బ జలాలు అధిగమించేందుకు ఉన్న కొద్దిపాటి నీటి వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు స్థానిక రైతులు బిందుసేద్యంవైపు మొగ్గు చూపిస్తున్నారు.

ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఉద్యానవన పథకాలను స్థానిక అన్నదాతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులను పొందుతూ లాభాలు పొందాలంటే రైతులు కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలను సాగుచేసుకోవాలని వ్యవసాయ అధికారులు చేస్తున్న సూచనలను రైతులు పాటిస్తున్నారు టమాట, చిక్కుడు, మిరప, దొండ, బీర, అనుపకాయ, క్యాప్సికమ్, క్యాబేజీ తదితర పంటల సాగుతో పాటు పత్తి, ఆముదం, చెరుకు, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి వాణిపంటల సాగుతో రైతులు బిజిబిజిగా పనులు చేసుకుంటున్నారు. అదే విధంగా మామిడి, బొప్పాయి, అరటి, ద్రాక్ష వంటి పంటలతోటల సాగుకు బిందు సేద్యం పూర్తి స్థాయిలో

ఉపయోగపడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో బిందు సేద్యం ద్వారా పూలతోటలు, పండ్ల తోటలు సాగు చేసినందుకు రైతులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని బుచ్చిగూడ, కొండన్నగూడ, వెల్జర్ల, దూసకల్, బూర్గుల, రాయికల్, నాగులపల్లి, కిషన్‌నగర్, హాజిపల్లి, గ్రామాల్లో ఎక్కువగా బిందు సేద్యంతో కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. బిందు సేద్యంతో ఎన్నో లాభాలు ఉన్నాయని అన్నదాతలు పేర్కోంటున్నారు.

గ్రామాల్లో విస్తరిస్తున్న బిందు సేద్యం..

షాద్‌నగర్ నియోజక వర్గంలో భూగర్బ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూక్ష్మసేద్యం, బిందు సేద్యం పథకాలను ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. షాద్‌నగర్ నియోజక వర్గంలోని కొత్తూర్, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో రైతులు బిందు సేద్యం ద్వారా పంటలను సాగు చేసుకుంటున్నారు. 2003వ సంవత్సరంలో ప్రారంభమైన బిందు సేద్యం పథకానికి రైతుల నుండి డిమాండ్ పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు.

షాద్‌నగర్ డివిజన్‌లో గత సంవత్సరం 5580 ఎకరాల్లో బిందుసేద్యం ద్వారా పంటల సాగులో ఉన్నాయని ఉద్యానవన శాఖ అధికారి అన్నారు. షాద్‌నగర్ డివిడన్ పరిధిలో బిందు సేద్యంకు రైతుల నుండి ఎక్కువగా డిమాండ్ పెరిగిందని రైతుల డిమాండ్‌కు అనుగుణంగా పరికరాలు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎన్నో సబ్సిడి పథకాలను ప్రవేశపెట్టడం జరుతుందని వాటన్నింటిని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

డ్రిప్ పరికరాలు రైతులందరికి అందించాలి..
అశోక్, కూరగాయల సాగుదారుడు, చటాన్‌పల్లి

డ్రిప్ పరికరాలతో కూరగాయల పంటల సాగు ఎంతో బాగుంది. తక్కువ నీటితో పంటలను సాగు చేయవచ్చు. ప్రభుత్వం ద్వారా డ్రిప్ పరికరాలు ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే విధంగా చర్యలు చేపట్టాలి. సబ్సిడి డ్రిప్ సిస్టమ్‌కోసం దరఖాస్తు చేసుకున్నా చాలా రోజులు పడుతుంది.. ప్రతి రైతుకు వీటిపై అవగాహన కల్పించి అందించాలి.. డ్రిప్ పరికరాల ద్వారా రైతుకు ఎంతో మేలు జరుగుతుంది. డ్రిప్ పద్దతిలో సాగు చేసిన కూరగాయలతో అధిక దిగుబడి రావడం వల్ల లాభాలు పొందుతున్నాం.

డ్రిప్ సిస్టమ్‌తో తక్కునీటితో పంట..

రాజు గౌడ్, కూరగాయలు, పూల సాగుదారుడు, దూసకల్
డ్రిప్ పరికరాలతో తక్కువ నీటితో ఎక్కువ మొత్తంలో పంటను సాగు చేసేందుకు వీలు ఏర్పడింది.. కూరగాయల పంటలతో పాటు పూల తోటల సాగు చేస్తున్నాం.. వ్యవసాయం చేసి నష్టాల పాలై ప్రస్తుతం ఈ డ్రిప్ పరికరాల వల్ల లాభాలు చూస్తున్నాం.. తక్కువ నీటితో ఎక్కువ మొత్తంలో పంటను సాగు చేయవచ్చు.. ప్రస్తుతం నీటి ఇబ్బందులున్నా డ్రిప్ సిస్టమ్ ఉన్నందునే పంటను కాపాడుకుంటున్నాం.

High Yields for Farmers with Drip Irrigation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిందు సేద్యంకై రైతన్న ఆసక్తి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.