మున్సిపోల్స్‌పై నేడు స్పష్టత

మన తెలంగాణ/హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నేడు స్పష్టత రానుంది. ఈ ఎన్నికలపై మంగళవారం హైకోర్టు తన తీర్పును వెలువడించనుంది. కోర్టు తీర్పు ఆదారంగానే ఎన్నికలను ఎప్పుడు జరపాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుం ది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్న అంశంపై ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా అభ్యంతరా లు వ్యక్తమైన మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలను నిర్వహించడానికి సిద్దంగా ఉన్నట్లు నాలు […] The post మున్సిపోల్స్‌పై నేడు స్పష్టత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నేడు స్పష్టత రానుంది. ఈ ఎన్నికలపై మంగళవారం హైకోర్టు తన తీర్పును వెలువడించనుంది. కోర్టు తీర్పు ఆదారంగానే ఎన్నికలను ఎప్పుడు జరపాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుం ది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్న అంశంపై ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా అభ్యంతరా లు వ్యక్తమైన మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలను నిర్వహించడానికి సిద్దంగా ఉన్నట్లు నాలు గు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కోర్టు కౌం టర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై హైకోర్టు సంతృప్తి చెందుతుందా? లేదా అభ్యంతరాలు ఉన్న మున్సిపాలిటీలను మినహాయించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తుందా? అన్న అంశంపై కొనసాగుతున్న సస్పెన్స్ కూడా వీడనుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మొద టి నుంచి భావిస్తున్నట్లుగా పాలకమండలి గడు వు తీరిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్త మున్సిపాలిటీలకు కలిసి ఎన్నికలను నిర్వహిస్తుందా? అన్న అంశంపై స్పష్టత రానుంది.

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభు త్వం తొలత భావించింది. ఆ దిశగా ప్రణాళికలను శరవేగంగా పూర్తి చేసింది. ఇందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన వార్డుల విభజన, జనాభా ఆధారంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్ల ప్రక్రియను కూడా రెండు నెలల క్రితమే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో గత నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రంగం సిద్దం అవుతున్న సమయంలో పలు రాజకీయ పార్టీలతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వార్డుల విభజన, వార్జుల రిజర్వేషన్లపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలా దాదాపు 43 మున్సిపాలిటీలపై కోర్టుల్లో కేసులు పడ్డాయి. దీని కారణంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. పైగా కొత్త మున్సిపల్ చట్టం ఆదారంగా ఎన్నికల నిర్వహించాలని సిఎం కెసిఆర్ భావించి గత నెలలో చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదింప చేశారు.

అయితే ఈ బిల్లుపై రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ రెండు, మూడు అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా నూతన మున్సిపల్ చట్టానికి మళ్ళీ సవరణలు చేయాల్సి రావడం వల్ల ఎన్నికల ప్రక్రియకు కొంత జాప్యం జరిగింది. అయినప్పటికీ సిఎం కెసిఆర్ మాత్రం మున్సిపల్ ఎన్నికల నిర్వహణను సాధ్యమైనంత త్వరగా పూర్తి ్త చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలు ముగిస్తే రాష్టంలో పాలనను మరింత పరుగులు తీయించడంతో పాటుగా పెద్దఎత్తున సంక్షేణ, అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణను దూసుకుపోయే విధంగా వ్యూహాలను సిద్దం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల కారణంగా రాష్ట్రంలో పాలనకు ఎటువంటి అడ్డంకులు రాకూడదన్న లక్షంతోనే సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రక్రియను త్వరగా ముగించాలని భావించారు.

రాష్ట్రంలో మొత్తం 141 మున్సిపాలిటీలు ఉండగా వాటిల్లో పాలకమండలి గడువు తీరిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలతో మొత్తం 129 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు కలిపి మొత్తం 3,385 వార్డులను ఎన్నికలను నిర్వహించాలని తలపెట్టారు. ప్రతి వార్డులో 1,500 నుంచి మూడువేల ఓటర్లు ఉండేలా జాబితాలను రూపొందించారు. ఇక కార్పొరేషన్ పరిధిలో ఒక్కో వార్డుల్లో 15వేల వరకు ఓటర్లు ఉన్నారు. కాగా అయితే కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మాత్రం వెనువెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశముంది తెలుస్తోంది.

High Court will issue verdict on municipal elections

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మున్సిపోల్స్‌పై నేడు స్పష్టత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: