ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే

  ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల నిర్వాహణపై హైకోర్టు స్టే విధించింది. ఆమనగల్లు మున్సిపాలిటీలో వార్డుల విభజన, ఓటర్ల జాబితా సక్రమంగా లేదంటూ ఆమనగల్లు పట్టణానికి చెందిన మండన్ శ్రీకాంత్ సింగ్ గత నెల 29 న హైకోర్టును ఆశ్రయించారు. శ్రీకాంత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించడంతో వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ సక్రమంగా చేయాలని, అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పట్లో […] The post ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల నిర్వాహణపై హైకోర్టు స్టే విధించింది. ఆమనగల్లు మున్సిపాలిటీలో వార్డుల విభజన, ఓటర్ల జాబితా సక్రమంగా లేదంటూ ఆమనగల్లు పట్టణానికి చెందిన మండన్ శ్రీకాంత్ సింగ్ గత నెల 29 న హైకోర్టును ఆశ్రయించారు. శ్రీకాంత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించడంతో వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ సక్రమంగా చేయాలని, అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేకుండా పోయింది.

ఆమనగల్లు, విఠాయిపల్లి గ్రామపంచాయితీలను కలిపి 2018 ఆగస్టున ఆమనగల్లు పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసింది. 14,785 ఓట్లు కలిగిన ఆమనగల్లు పురపాలక సంఘం 11 వార్డులుగా ఏర్పాటు చేశారు. తాజా మున్సిపల్‌చట్టంలో కోత్తగా చేపట్టిన సవరణలో బాగంగా వార్డుల సంఖ్య 15 కు పెరిగింది. ఒక్క వార్డులో అత్యధికంగా 11 వందల మంది ఓటర్లు,ఒక వార్డులో 6 వందల ఓటర్లు, ఓటరు లీస్టులో కూడా అనేక తప్పులు దోర్లాయని,ఒకే వార్డుకు చెందిన ఓటర్లు రెండు, మూడు వార్డుల్లో ఉన్నారని పిటిషన్‌లో పెర్కోన్నారు.హైకోర్టు స్టే ఆర్డర్ కాపీలను శుక్రవారం ఆమనగల్లు మున్సిపల్‌కమిషనర్ వెంకట్రాములుకు శ్రీకాంత్‌సింగ్ అందజేశారు.

High Court stays on Amanagal Municipal Elections

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: