న్యాయకమిటీ ప్రతిపాదనకు స్వస్తి

RTC strike

 

అంగీకరించని రాష్ట్ర ప్రభుత్వం

ఆర్‌టిసి సమ్మెపై హైకోర్టు విచారణ 18కి వాయిదా
ప్రైవేటు రూట్లపై నేడు విచారణ

హైదరాబాద్ : ఆర్‌టిసి సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ లు చేసింది. హైకోర్టు మంగళవారం సూచించిన ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ప్రతిపాదనకు ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీల ప్రస్తావన లేదని ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టులో వి చారణ పెండింగ్ లో ఉన్నందున లేబర్ కోర్టుకు వెళ్లలేదని ప్రభుత్వం నివేదించింది. తదుపరి చ ర్యలు చేపట్టేలా కార్మికశాఖ కమిషనర్ ను ఆదేశించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

ఈక్రమంలో ఎస్మా ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని ఎజి ప్రసాద్ వాదించారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ ప్రకారం టిఎస్ ఆర్‌టిసిని ఏర్పాటు చేశామని ఎ జి కోరుటకు వివరించారు. సెక్షన్47ప్రకారం కేంద్రం అనుమతి లేదు కదా? అని ఈ సందర్భ ంగా హైకోర్టు ప్రశ్నించింది. టిఎస్ ఆర్‌టిసి ఏ ర్పాటుకు కేంద్రం అనుమతి తప్పనిసరి కాదని, రోడ్డు రవాణాపై రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని ఎజి వాదనలు వినిపించారు.

గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జివొ లను ఈ సందర్భంగా ఎజి కోర్టులో ప్రసావించారు. ఎస్మా పై 2015లో ప్రభుత్వం తీసుకొచ్చిన జిబొ నంబర్ 9ను ప్రస్తావించారు. ఆరు నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు జిఒను పొడగిస్తారని ఎజి పేర్కొన్నారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన జిఒ నం.180ని కూడా ఎజి కోర్టులో ప్రస్తావించారు. ఈక్రమంలో ఆ జివొలు తెలంగాణకు వర్తించదని హైకోర్టు తెలిపింది. దీంతో పునర్విభజన చట్టం సెక్షన్ 68 ప్రకారం పబ్లిక్ యుటిలిటీ సర్వీసులు ఎస్మా పరిధిలోకి వస్తాయని ఎజి ప్రసాద్ తన వాదనలు వినిపించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్‌టిసి చట్టం కేంద్ర చట్టంలో భాగమే, కేంద్రం అనుమతులు అవసరమేనని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. ఇప్పటివరకు 27మంది ఆర్‌టిసి కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్లు న్యాయస్థానానికి నివేదించారు. ఆర్‌టిసి సమ్మెపై విచారణను ఈనెల 18కి, ప్రైవేటు రూట్లపై విచారణను 14 (నేటికి) వాయిదా వేసింది.
కార్మికులంతా కంపెనీ చట్టాలను లోబడి ఉండాలి

1947 పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం(ఐడి యాక్ట్) ప్రకారం కార్మికులంతా కంపెనీ చట్టాలకు లోబడి ఉండాలని అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్‌టిసి సమ్మెపై చట్ట ప్రకారం లేబర్ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్‌టిసి కార్మికులు ఎవరి ఆదేశాలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పారిశ్రామిక వివాదాల చట్టం 10 ప్రకారం లేబర్ కమిషనర్‌కు ఈ సమ్మె విషయమై ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది.

ఆర్‌టిసి కార్మికుల సమ్మె లేబర్ కోర్టు పరిధిలో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. హైపవర్ కమిటీ గురించి ధర్మాసనం చేసిన ప్రస్తావనపై మంగళవారం అడ్వకేట్ జనరల్ ప్రసాద్ స్పందిస్తూ కార్మికసంఘాలు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పారిశ్రామిక వివాదాల చట్టం (ఐడీ యాక్ట్) ప్రకారం వ్యవహరిస్తామని, ఆ మేరకు లేబర్ కోర్టు ద్వారా తేల్చుకుంటామని కార్మికసంఘాల అఫిడవిట్లో ఉన్న విషయాన్ని ఎజి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన విషయం విదితమే.

High Court hearing on RTC strike

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post న్యాయకమిటీ ప్రతిపాదనకు స్వస్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.