ప్రైవేటుకు తొవ్వ

  ఆర్‌టిసిలో ప్రైవేటుపై పిల్‌ను కొట్టివేసిన హైకోర్టు జిఒ రాకముందే పిటిషన్ ఎలా వేస్తారు? మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 102 కింద ప్రభుత్వానికి పూర్తి అధికారాలుంటాయి ప్రజల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టలేము : హైకోర్టు ప్రభుత్వానికి, ప్రైవేట్‌కు పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమని వాదించిన ఎజి హైదరాబాద్ ః మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్102, 1988 ప్రకారం ప్రభుత్వానికి ప్రైవేటీకరణపై పూర్తి అధికారాలు ఉన్నాయని శుక్రవారం నాడు ధర్మాసనం వెల్లడించింది. ప్రవేటీకరణపై దాఖలైన […] The post ప్రైవేటుకు తొవ్వ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆర్‌టిసిలో ప్రైవేటుపై పిల్‌ను కొట్టివేసిన హైకోర్టు

జిఒ రాకముందే పిటిషన్ ఎలా వేస్తారు? మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 102 కింద ప్రభుత్వానికి పూర్తి అధికారాలుంటాయి
ప్రజల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టలేము : హైకోర్టు

ప్రభుత్వానికి, ప్రైవేట్‌కు పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమని వాదించిన ఎజి

హైదరాబాద్ ః మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్102, 1988 ప్రకారం ప్రభుత్వానికి ప్రైవేటీకరణపై పూర్తి అధికారాలు ఉన్నాయని శుక్రవారం నాడు ధర్మాసనం వెల్లడించింది. ప్రవేటీకరణపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఆర్‌టిసి రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు శుక్రవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పిఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మూడు సుప్రీంకోర్టు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ అమలు చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.

రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం వేరు అథారిటీ వేరని, ప్రభుత్వం చేయాల్సిన పని అథారిటీ ఎలా చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. అయితే రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ ప్రక్రియ నిర్వహిస్తారని ఎజి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి జివొ రాకముందే కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేయకూడదన్న ఎజి వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఆర్‌టిసి ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి, ప్రైవేటు మధ్య ఆనందకర పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమవుతాయని హైకోర్టు ఎజి వాదనకు ఏకీభవించింది.

ఈ నేపథ్యంలో రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన అన్ని పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. 5100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగించడం తప్పు కాదని స్పష్టం చేసింది. మరోవైపు రూట్ల ప్రైవేటీకరణపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. మోటార్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలుంటాయని హైకోర్టు పేర్కొంది.

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టలేమని వ్యాఖ్యానించింది. ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. రూట్ల ప్రవేటీకరణలో జోక్యం చేసుకోమని, మోటార్ వెహికల్ చట్టం 1988, 102 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రూట్ల ప్రవేటీకరణ చేసే హక్కు ఉంటుందని కోర్టు తెలిపింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వానికి విశేష అధికారాలున్నాయని తెలిపింది. ఇదిలావుండగా భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే ఉద్యమాన్ని విరమించి విధుల్లోకి చేరతామన్న ఆర్‌టిసి కార్మికులకు భంగపాటు ఎదురైంది.

High Court green signal for privatization of RTC

The post ప్రైవేటుకు తొవ్వ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: