నిజామాబాద్ ఎన్నిక వాయిదాకు హైకోర్టు నో

  మన తెలంగాణ/ హైదరాబాద్ : ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఏ నియోజకవర్గం ఎన్నికనూ వాయిదా వేసేలా ఉత్తర్వులు ఇవ్వలేమని, అందుకే నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికను వాయిదా వేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చునని, ఎన్నికలను వాయిదా వేయాలని వ్యాజ్యాలు దాఖలు చేయ డం సరికాదని పేర్కొంది. ఎన్నికల వాయిదాకు ఉత్తర్వులు ఇవ్వబోమని తాత్కాలిక ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ రాఘవేంద్ర […] The post నిజామాబాద్ ఎన్నిక వాయిదాకు హైకోర్టు నో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఏ నియోజకవర్గం ఎన్నికనూ వాయిదా వేసేలా ఉత్తర్వులు ఇవ్వలేమని, అందుకే నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికను వాయిదా వేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చునని, ఎన్నికలను వాయిదా వేయాలని వ్యాజ్యాలు దాఖలు చేయ డం సరికాదని పేర్కొంది. ఎన్నికల వాయిదాకు ఉత్తర్వులు ఇవ్వబోమని తాత్కాలిక ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యా యమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఖరాఖండీగా చెప్పింది. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి స్వతంత్రులుగా పోటీ చేస్తున్న వారికి ఇప్పటి వరకూ ఎన్నికల గుర్తు కేటాయించలేదని, వెంటనే ఎన్నికల గుర్తులు కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రవి మరో పదిహేను మంది స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు విచారించింది.

ఈ సందర్భంగా నిజామాబాద్ లోక్‌సభ సీటుకు ఎన్నికల వాయిదా వేసే ప్రసక్తే లేదని బెంచ్ స్పష్టం చేసింది. ఎన్నికల చిహ్నాల కేటాయింపులు చేయకపోవడంపై కేంద ఎన్నికల సంఘాన్ని వివరణ కోరతామని, ఈ అంశంపై విచారణ జరుపుతామని బెంచ్ వివరించింది. స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పుడు ఏయే చిహ్నాలు కావాలో ప్రాధాన్యతలు అఫిడవిట్లల్లో కోరడం జరిగిందని, అయినా ఇప్పటి వరకూ ఎన్నికల గుర్తులు ఇవ్వలేదని, ఎన్నికలు సమీపిస్తున్నా ఎందుకు గుర్తులు కేటాయించకపోవడం అన్యాయమని పిటిషనర్ల తరఫు లాయర్ రచనారెడ్డి వాదించారు. ఎన్నికల గుర్తులు కేటాయించకుండా ఎన్నికలు నిర్వహించడం అన్యాయమని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయడమే సబబు అన్నారు. అధికారపార్టీకి మేలు చేసేందుకే ఈ విధంగా జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని 226 అధికరణ కింద హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 187 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే వారికి ఈసీ గుర్తులు కేటాయించి శిక్షణ ఇవ్వాలన్న నిబంధనను అమలు అంతంతమాత్రంగా చేస్తోందన్నారు. గుర్తుల్ని కేటాయించిన తర్వాతే ఎన్నికలు జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని, అవసరమైతే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికను వారం పదిరోజులు అయినా వాయిదా వేసేలా ఈసీకి ఆదేశాలివ్వాలని రచనారెడ్డి హైకోర్టును కోరారు. ఎన్నికల గుర్తుల కేటాయింపు అంశం కేంద్ర ఎన్నికల సంఘ పరిధిలోకి రాదని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేయాలని ఈసీ తరఫు లాయర్ అవినాష్ దేశాయ్ చెప్పారు. ఈ కారణంగా కేంద్రాన్ని ప్రతివాదిగా చేసి వ్యాజ్యాన్ని విచారించాల్సివుందన్నారు.

వాదనల అనంతరం డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. నిజామాబాద్ లోక్‌సభ సీటు ఎన్నికల కేసులో తాము జోక్యం చేసుకునేదే లేదు. ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదు. ఎన్నికల గుర్తు కేటాయింపు వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధి కాబట్టి పిటిషనర్లు కేంద్రాన్ని ప్రతివాదిగా చేస్తే తాము కేంద్రానికి నోటీసు ఇచ్చి విచారణ చేస్తాం. ఎన్నికలపై అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలేగానీ ఇలా వ్యాజ్యాలు దాఖలు చేసేందుకు ఆస్కారం లేదు..’ అని తేల్చి చెప్పింది. వ్యాజ్యం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిజామాబాద్ ఎన్నిక వాయిదాకు హైకోర్టు నో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: