ఊబకాయం పిల్లల్లో అత్యధిక రక్తపోటు

Childrenలండన్ : ఊబకాయులైన పిల్లల్లో రక్తపోటు (బిపి) రెండు రెట్లు ఎక్కువగా ఉండి గుండెపోటుకు , గుండె వైఫల్యానికి దారి తీస్తుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ఈ అధ్యయనం వెల్లడైంది. నాలుగేళ్లు వయస్సున్న ఊబకాయులైన పిల్లలు ఆరేళ్ల వయస్సు వచ్చేసరికి బిపి రెట్టింపు అయ్యే రిస్కు ఉందని అధ్యయనం హెచ్చరించింది. ఇటువంటి పిల్లలు శారీరకంగా చురుకుగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. ముఖ్యంగా గర్భిణులు ప్రసవం ముందు అధిక బరువు లేకుండా జాగ్రత్త పడాలి. గర్భిణులకు పొగతాగడం అలవాటు ఉంటే వెంటనే విడిచి పెట్టాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే పిల్లలు ఊబకాయులు కాడానికి దారి తీస్తుందని స్పెయిన్ లోని కేర్లస్ హెల్తు ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఇనాక్ గెర్లాన్ వెల్లడించారు. ఊబకాయానికి ఎక్కువ బిపికి గల సంబంధంపై 1796 మంది పిల్లలను రెండేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఊబకాయం, ఛాతీ చుట్టు కొలతల ఆధారంగా బిపిని గణించారు. నాలుగు, ఆరేళ్ల వయస్సు మధ్య గల ఆరోగ్యవంతమైన శరీరం బరువు గలిగిన వారితో ఊబకాయులను పోల్చి చూశారు. ఊబకాయులైన వారిలో 2.49 నుంచి 2.54 వరకు అత్యధిక రక్తపోటు ఉన్నట్టు తేలింది.

ఆరోగ్యకరంగా శరీరం ఉండవలసిన బరువు ఉండడానికి, ఎక్కువగా ఉన్న కిలోల బరువు తగ్గించుకోడానికి వ్యాయామం అవసరమని అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని పరిశోధకులు గెలాన్ సూచించారు. ఇంతేకాకుండా ఇందులో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, పాఠశాలల్లో ప్రతివారం మూడు నుంచి నాలుగు గంటల పాటు శారీరక వ్యాయామం చేయించడం అవసరమని పేర్కొన్నారు.

High Blood Pressure in Obese Children

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఊబకాయం పిల్లల్లో అత్యధిక రక్తపోటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.