శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

  శంషాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఎయిర్‌పోర్టులో నిఘా పెంచారు. స్వాతంత్ర్యదినోత్సవం, జమ్ముకశ్మీర్‌లోని పరిస్ధితుల నేపధ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌పోర్టు విలేజి, పార్కింగ్‌లను జాగీలలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇతర ప్రాంతల నుండి వస్తున్న ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తున్నారు. ఈ సందర్భంగా జీఎఆర్ అధికారి […] The post శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శంషాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఎయిర్‌పోర్టులో నిఘా పెంచారు. స్వాతంత్ర్యదినోత్సవం, జమ్ముకశ్మీర్‌లోని పరిస్ధితుల నేపధ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌పోర్టు విలేజి, పార్కింగ్‌లను జాగీలలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇతర ప్రాంతల నుండి వస్తున్న ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తున్నారు. ఈ సందర్భంగా జీఎఆర్ అధికారి మురళికృష్ణ మాట్లాడుతూ… ప్రయాణికులు రెండున్న గంటల ముందు ఎయిర్‌పోర్టుకు రావాలన్నారు. అదేవిధంగా ఈనెల 10వ తేది నుండి 20వ తేది వరకు సందర్శకుల పాసులు కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

High alert at Rajiv Gandhi International Airport

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: