హర్రర్ ‘హేజా’టీజర్ అదరగొడుతోంది

 

 

Heza

హైదరాబాద్: టాలీవుడ్‌లో అరుందతి, భాగమతి సినిమాల తరువాత హర్రర్ స్టైల్‌లో మరో చిత్రం హేజా రాబోతుంది. ‘హేజా’ టీజర్‌ను మున్నా కాశీ అద్భుతంగా తెరకెక్కించాడని నెటిజన్లు కామెంట్లు చేసున్నారు. ఈ సినిమాను విఎన్‌వి క్రియోషన్స్ పతాకంపై విఎస్‌ఎన్ మూర్తి నిర్మిస్తుండగా మున్నా కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. మునీ కాశీ ఫస్ట్ టైమ్ హీరో కమ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. గతంలో పలు సినిమాలకు కాశీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈ మూవీలో ముమైత్ ఖాన్ మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో వచ్చిన హర్రర్ సినిమాలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుందని కాశీ చెప్పారు. సినీ ప్రేక్షకులు ఆశ్చర్యం చెందేలా మూవీని తీశామని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ 90 శాతం పూర్తి అయిందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నారు.

 

The post హర్రర్ ‘హేజా’ టీజర్ అదరగొడుతోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.