కరోనా కట్టడికి హీరోలు, డైరెక్టర్ల భారీ విరాళాలు..

  హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కేంద్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించింది. కరోనాను ఎదుర్కొవాలంటే ప్రజలందరూ 21 రోజులు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించింది. ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని కోరింది. ఇక, కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి రూ. కోటి, రెండు […] The post కరోనా కట్టడికి హీరోలు, డైరెక్టర్ల భారీ విరాళాలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కేంద్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించింది. కరోనాను ఎదుర్కొవాలంటే ప్రజలందరూ 21 రోజులు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించింది. ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని కోరింది. ఇక, కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి రూ. కోటి, రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళం అందించాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయలు విరాళం చేసాడు. కరోనా వైరస్ బాధితుల కోసం ముఖ్యమంత్రుల సహాయనిధితో పాటు ప్రధాన మంత్రి నిధికి కూడా ఈ కోటిని విరాళంగా ఇచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న రోజువారి కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా ఈ చిన్న సాయం చేస్తున్నట్లు ట్వీట్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తెలంగాణ, ఎపి రాష్ట్రాలకు రూ.కోటి విరాళం అందించాడు. యంగ్ హీరో నితిన్ రూ.20 లక్షలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ.70 లక్షలు, నిర్మాత దిల్ రాజు, సిరీష్ లు రూ.20 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.20 లక్షలు, అనిల్ రావుపూడి రూ. 10 లక్షలు, కొరటాల శివ రూ.10 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళం అందించారు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో రోజువారి వేత‌నంతో పూట గ‌డిపే కార్మికులకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు.తాజాగా డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ వీరికి రూ. 5 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు.

 Heroes Donates Money to Telugu States CM Relief Fund

The post కరోనా కట్టడికి హీరోలు, డైరెక్టర్ల భారీ విరాళాలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: