హైదరాబాద్ : తెలుగు ప్రేక్షకులు తన సినిమాలను సరిగా ఆదరించడం లేదని ప్రముఖ తమిళ హీరో విక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. విక్రమ్ కు తమిళతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ప్రయోగాత్మక సినిమాలను చేయడంపై ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తారన్న విషయం తెలిసిందే. తమిళంలో ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అవుతుంటుంది. ఆయన తాజాగా నటించిన ’మిస్టర్ కెకె‘ సినిమా కూడా ఓ ప్రయోగాత్మక సినిమానే. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. తన గత చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదని ఆయన పేర్కొన్నారు. తాను నటించిన ’స్కెచ్‘, ’సామి2‘ సినిమాలు తమిళంలో విజయం సాధించినప్పటికీ, తెలుగులో మాత్రం అపజయం మూటగట్టుకున్నాయని ఆయన చెప్పారు. తన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరించడం లేదో అర్ధం కావడం లేదని ఆయన వాపోయారు. అయితే ’మిస్టర్ కెకె‘ మాత్రం తెలుగు ప్రేక్షకులను తప్పక ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తదనం కోసం తాను చేసిన సినిమాలు కొన్ని సార్లు సరైన విజయాన్ని సాధించలేదని, ఈ కారణంతో తన సినిమాల పట్ల అనాసక్తిని చూపించొద్దని ఆయన తెలుగు ప్రేక్షకులను కోరారు.
Hero Vikram Comments On Tollywood
Related Images:
[See image gallery at manatelangana.news]The post నా సినిమాలను ఆదరించడం లేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.