‘దృశ్యం 2’ తెలుగు రీమేక్ లో వెంకటేశ్

Hero Venkatesh Act in Drushyam2 Telugu Remakeహైదరాబాద్ : మలయాళంలో వచ్చిన ’దృశ్యం‘ సిమాకు సీక్వెల్ గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోంది. మలయాళంలో తీసే ఈ సినమాలో మోహన్ లాల్, మీనా జంటగా నటిస్తున్నారు. అయితే ‘దృశ్యం 2’ను తెలుగులో కూడా నిర్మించనున్నారు. తెలుగు ‘దృశ్యం‘లో నటించిన విక్టరీ వెంకటేశ్, మీనాలే జంటగా ‘దృశ్యం 2’ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ’దృశ్యం‘  సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ‘దృశ్యం 2’ను నిర్మిస్తున్నారు. తెలుగు ‘దృశ్యం 2’లో కూడా వెంకటేష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ తమిళ సినిమా ’అసురన్‘ తెలుగు రీమేక్ ’నారప్ప‘లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మలయాళ సినిమా ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ రీమేక్‌లోనూ వెంకటేశ్ నటించనున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ సినిమా తర్వాతనే వెంకటేశ్ ’దృశ్యం2‘లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై వెంకటేశ్ మాత్రం ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్ లో వెంకటేశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.