టిడిపి ఓటమికి ఆయనే కారణం …

Hero Sumanహైదరాబాద్ : ప్రముఖ నటుడు సుమన్ జనసేన చీఫ్, హీరో పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎపిలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఓటమి పాలు కావడానికి పవన్ కల్యాణ్ మాత్రమే కారణమని సుమన్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పవన్ పార్టీ పోటీ చేయడం వల్లనే ఓట్లు చీలి టిడిపి ఓడిపోయిందని ఆయన చెప్పారు. ఓ పార్టీకి ఇన్ని ఎక్కువ సీట్లు రావడం తాను జన్మించిన తరువాత చూడడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. సిఎం జగన్ ను ఆయన అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేళ్ల పాటు జగన్ అనేక కష్టాలు పడ్డారని, ఈ క్రమంలోే ఆయన కష్టం ఫలించి ఎన్నికల్లో గెలిచారని సుమాన్ వెల్లడించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయమని ఆయన తెలిపారు. ఎపిలోకి సినిమా పరిశ్రమను తీసుకొచ్చి, సినిమా పరిశ్రమ అభివృద్ధికి పాటుపడాలని సుమన్ జగన్ ను కోరారు.

Hero Suman Comments On TDP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిడిపి ఓటమికి ఆయనే కారణం … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.