రాజశేఖర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు: జీవిత

Jeevitha's Brother Passess away in Hyderabad

 

హైదరాబాద్:  నటుడు రాజశేఖర్ కారు ప్రమాదంపై మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన భార్య జీవిత తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డులో కారు ముందు టైర్ పేలడంతో డివైడర్ ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో రాజశేఖర్ చిన్నపాటి గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వాహనదారులు సమాచారం ఇవ్వడంతో రాజశేఖర్ ను సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దేవుడు, అభిమానుల ప్రేమ వల్ల రాజశేఖర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని ఆమె తెలిపింది. పోలీసులకు సమాచారం ఇచ్చామని, అవసరమైతే  పోలీస్ స్టేషన్ కు వెళ్లి స్టేట్ మెంట్ ఇస్తామని వెల్లడించారు.  

 

Hero Rajasekhar Escaped from Major Car Accident

 

 

 

The post రాజశేఖర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు: జీవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.