ప్రభాస్ సినిమా …. 30 కోట్లతో భారీ సెట్

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడు. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే ఐరోపాలో కొంత వరకు […] The post ప్రభాస్ సినిమా …. 30 కోట్లతో భారీ సెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడు. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే ఐరోపాలో కొంత వరకు షూటింగ్ జరుపుకుంది. అనివార్య కారణాల వల్ల అక్కడ తీయాల్సిన సన్నివేశాలను హైదరాబాద్ లోనే తీయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో రూ.30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా ఓ భారీ సెట్ ను వేయిస్తున్నారు. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఈ సెట్ లో తీయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ప్రముఖ నటి పూజా హెగ్డే నటిస్తున్నారు. సాహో సినిమా తరువాత ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Hero Prabhas Movie : Huge Set With 30 Crores

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రభాస్ సినిమా …. 30 కోట్లతో భారీ సెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: