మీరు నమ్మకపోయినా సరే…అనుష్కతో ప్రేమ లేదు…

Hero Prabhasహైదరాబాద్ : తమ మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదని హీరో ప్రభాస్ ఒకవైపు, హీరోయిన్ అనుష్క మరో వైపు చెబుతున్నప్పటికీ, ఎవరూ నమ్మని పరిస్థితి వారికి ఎదురవుతోంది. దీంతో ప్రభాస్ మరోసారి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తాము ప్రేమించుకుని ఉంటే, ఏదో ఒక రోజు జంటగా ప్రజలకు కనబడేవారిమని, ఇప్పటి వరకు అలా జరిగిందా అని ప్రభాస్ ప్రశ్నిస్తున్నారు. తాము నిజం చెప్పినా నమ్మకుంటే తామేమీ చేయలేమని, కేవలం తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఆయన చెప్పారు. ఒక వేళ తాను అనుష్కను ప్రేమించి ఉంటే ఇప్పటికే చెప్పేవాడినని, తన వ్యక్తిగత విషయాలను దాచాలని తానెప్పుడూ అనుకోనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇటువంటి పుకార్లకు స్వస్తి పలికాలని ఆయన కోరారు. అనుష్కతో తనకు ముడిపెట్టి పుకార్లు సృష్టించడం ఆవేదన కలిగిస్తుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఏదో ఒకరోజు తాను పెళ్లి చేసుకోవాల్సిందేనని, అయితే అది ప్రేమ వివాహం కూడా కావొచ్చని ప్రభాస్ కొంతకాలం కింద చెప్పారు. దీంతోనే అనుష్క, ఆయనపై పుకార్లు వస్తున్నాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Hero Prabhas Comments On Actress Anushka

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మీరు నమ్మకపోయినా సరే… అనుష్కతో ప్రేమ లేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.