పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేసే కథతో…

  ‘ఆర్‌ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ఈ చిత్రాన్ని నిర్మించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో చిత్రం ’90 ఎంఎల్’. ఈ చిత్రంలో నేహా సోలంకి నాయికగా నటిస్తోంది. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ “ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో హీరో కార్తికేయకు బిగ్‌బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మా కాంబినేషన్‌లో మరో సినిమా ’90 ఎంఎల్’ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. టైటిల్‌కు తగ్గట్టుగానే చిత్రం […] The post పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేసే కథతో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ఆర్‌ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ఈ చిత్రాన్ని నిర్మించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో చిత్రం ’90 ఎంఎల్’. ఈ చిత్రంలో నేహా సోలంకి నాయికగా నటిస్తోంది. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ “ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో హీరో కార్తికేయకు బిగ్‌బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మా కాంబినేషన్‌లో మరో సినిమా ’90 ఎంఎల్’ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. టైటిల్‌కు తగ్గట్టుగానే చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు శేఖర్ రెడ్డి కొత్తవాడైనా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు”అని అన్నారు.

దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ “పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేసే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమాలో ఆరు పాటలున్నాయి. అనూప్ రూబెన్స్ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. చంద్రబోస్ యువతను ఆకట్టుకునేలా పాటలు రాశారు. ఈనెల 11 నుంచి హైదరాబాద్‌లో క్లైమాక్స్ తెరకెక్కిస్తాం. దీని తర్వాత మరో షెడ్యూల్‌లో బ్యాలెన్స్ టాకీ, రెండు పాటలను చిత్రీకరిస్తాం”అని తెలిపారు. రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, కాలకేయ ప్రభాకర్, సత్యప్రకాష్, ప్రగతి, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః జె.యువరాజ్, ఎడిటర్‌ః ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్‌ః వెంకట్, నృత్యాలుః ప్రేమ్ రక్షిత్, జానీ.

Hero Karthikeya New Movie 90 ML

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేసే కథతో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: