ఆషాఢంలో ఔషదాల గోరింటాకు…

  కొండమల్లెపల్లి : ఆషాడమాసంలో అతివల అరచేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటే ఐదవ తనమని ముత్తైదుల నమ్మకం. కొత్తగా పెళ్లి అయిన యువతులు ఈ నెలలో గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయన్ని కొనసాగిస్తున్నారు. వివాహాలు, వివిధ శుభకార్యాలకు ఆరచేతుల నిండ గోరింటాకు పెట్టుకుంటారు. పాదాలకు పారణి, ఆరచేతులకు ఆలంకరణగా గోరింటాకు సుపరితమే. తొలకరి అరంభం, ఆషాడమాసం కావడంతో గోరింటాకు చిగురిస్తుంది. లేత గోరింటాకు కోసి మెత్తగా రుబ్బి పెట్టుకుంటే బాగా పండుతుంది. పెళ్లి కాని అమ్మాయిలకు ఎర్రగా పండితే […] The post ఆషాఢంలో ఔషదాల గోరింటాకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొండమల్లెపల్లి : ఆషాడమాసంలో అతివల అరచేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటే ఐదవ తనమని ముత్తైదుల నమ్మకం. కొత్తగా పెళ్లి అయిన యువతులు ఈ నెలలో గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయన్ని కొనసాగిస్తున్నారు. వివాహాలు, వివిధ శుభకార్యాలకు ఆరచేతుల నిండ గోరింటాకు పెట్టుకుంటారు. పాదాలకు పారణి, ఆరచేతులకు ఆలంకరణగా గోరింటాకు సుపరితమే. తొలకరి అరంభం, ఆషాడమాసం కావడంతో గోరింటాకు చిగురిస్తుంది. లేత గోరింటాకు కోసి మెత్తగా రుబ్బి పెట్టుకుంటే బాగా పండుతుంది. పెళ్లి కాని అమ్మాయిలకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని పలువురు అంటుంటారు. ఈ గోరింటాకు ఎర్రగా పండి శరీర షాయల నుండి కండ్లకు ఇంపుగా కనిపిస్తాయి. ఆషాఢ మాసంలో దొరికే గోరింటాకు లేలేతగా ఉండి శరీరంలో రసం త్వరగా ఇంకి చేతులు కాళ్లు ఎర్రగా పండుతాయి.

ఔషధాల గోరింటాకు
గోరింటాకు సౌందర్య సాధనంగానే కాక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. కాళ్లు, చేతులు అధికంగా నీటిలో నానడం వల్ల పుండ్లు పండుతుంటాయి. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడుటం తగ్గుతుంది. ఆయుర్వేదంలో గోరింటాకును నోటి పూతకు, చర్మ కాలేయ, గనేరియ వంటి రోగాలకు వాడుతారు. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న వారు గోరింటాకు నూనెపై పూతగా వాడితేమంచి గుణం కనబడుతుంది. గోరింటాకు చెట్టు ఆకును రుబ్బి దానిని కాలిగోళ్లు, చేతి గోళ్ల చూట్టూ రెండు, మూడు గంటలు నాని ఆరిన తర్వాత తీసివేస్తే అది ఎర్రగా పండుతుంది.

ఆ విదంగా ఆ ఆకును గోళ్లకు పెట్టుకోవడం వలన ఆకు రసం వల్ల గోళ్లు పుచ్చిపోకుండా, పాడై పోకుండా గోళ్లకు, వేళ్లకు ఏ విధమైన అంటువ్యాధులు సోకకుండా రక్షిస్తుంది. గోర్ల చుట్టూ పెట్టుకొనే ఆకు కాబట్టి దానిని గోరింటాకు అంటారు. అందుకే కుల మాతాలకు అతీతంగా మన జీవన విధానంలో దానిని ఒక అచారంగా, సంప్రదాయంగా ప్రవేశపెట్టి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేశారు. ఈ పద్దతి కూడా ప్రకృతికనుగుణంగా వాతవరణ పరిస్థితులకుగుణంగా ప్రవేశపెట్టడంలోనే హిందువుల వైజ్ఞానిక దృక్ఫథం తేటతెల్లమవుతుంది.

శ్రావణ, బాద్రపధ మాసాలు, వర్షఋతువులు, వర్షాలు బాగ కురవడం వల్ల స్త్రీలు తమ తమ పనులన్నింటిని ఆ నీళ్లలో నానుతూ చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాక నిత్యం ఇంటి పనులు, వంట పనులు, పాత్రలు తోమడం, బట్టలు ఉతకడం, ఇళ్లు కడగడం, అలకడం వంటి పనులన్నీ నీళ్లలోనే చేసుకుంటూ ఉండడం వల్ల స్త్రీల కాలిగోళ్లు, చేతి గోళ్లు పుచ్చిపోయి రోగాలు వచ్చే ప్రమాధముంది. వాటినుండి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా గోరింటాకు పెట్టుకునే ఆచారం ప్రవేశపెట్టారు. వర్ష ఋతువుకు ముందు వచ్చే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే గోళ్లు పుచ్చిపోయే ప్రమాధం ఉండదు. తర్వాత బాద్ర బహుళ తదియ, ఉండ్రాళ్ల తదియ పండుగా, ఆశ్వయజ బహుళ తదియ అట్ల తద్ది పండుగ ఈ పండుగ రోజులలో తప్పనిసరిగా ముఖ్యంగా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పాటు చేశారు.

ఒకసారి వర్ష ఋతువు ముందు మరొకసారి వర్ష ఋతువు మధ్యలో, ఇంకొకసారి వర్ష ఋతువు అనంతరం ఇలా మూడు పర్యాయాలు ఇలా గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యకరమని చెబుతుంటారు. హిందువుల ఆచారాలు ఎంత వైజ్ఞానికంగాఆరోగ్యప్రథంగా ఉన్నాయో దీనిని బట్టి ఆర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ మూడు పర్యాయాలే పెట్టుకోవాలనే నియమం లేదు అవకాశం ఉన్నప్పుడు, అవసరం అయినప్పుడు దీనిని పెట్టుకుంటూ ఉండవచ్చు. క్రీముల భారీ నుండి గోళ్లను రక్షించడమే దీని ముఖ్య ఉధ్దేశ్యం. అయినప్పుటికి ఎర్రగా పండి అత్యంత అకర్షణీయంగా అందంగా ఉండడం వల్ల కూడా ఒక సౌందర్య సాదనంగా కనిపిస్తుంది. తెల్లజుట్టును కూడా నల్లబరిచే ఔషధ గుణం గోరింటాకులో ఉన్నదని ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

ఔషధగుణాలు

గోరింటాకు పొడిని నూనెలో కలిపి వడకట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. కళ్ల మంటలు తగ్గుతాయి. ఒక టీ స్పూన్ గోరింటాకు పోడిని నిమ్మరసంతో కలిపి ప్రతి రోజు తాగితే రక్తం శుభ్రపడి చర్మంలో మెరుగు వస్తుంది. కాళ్ల పగుళ్లను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.కృత్రియ గోరింటాకు పోడిని వాడటంతో కంటే సహజమైన గోరింటాను విడటం ఎంతైన మేలు.

Henna is Medicinal Plant

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆషాఢంలో ఔషదాల గోరింటాకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: