ఆయకట్టుపై నజర్…

  క్యాడ్‌వామ్‌లో భాగంగా 11 ప్రాజెక్టుల ఆయకట్టు, కాలువల అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి పనులు పూర్తయితే 13.28 లక్షల ఎకరాలకు నీరు, కమాండ్ ఏరియా అభివృద్ధికి కాలువలకు రూ. 1,489 లక్షలు అవసరం హైదరాబాద్: ప్రాజెక్టులు పూర్తైనా ఆయకట్టుకు కాలువలు లేని దుస్థితిని నివారించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇ ందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని సైతం వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. క్యాడ్‌వామ్ (కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, వాటర్ […] The post ఆయకట్టుపై నజర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్యాడ్‌వామ్‌లో భాగంగా 11 ప్రాజెక్టుల ఆయకట్టు, కాలువల అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
పనులు పూర్తయితే 13.28 లక్షల ఎకరాలకు నీరు, కమాండ్ ఏరియా అభివృద్ధికి కాలువలకు
రూ. 1,489 లక్షలు అవసరం

హైదరాబాద్: ప్రాజెక్టులు పూర్తైనా ఆయకట్టుకు కాలువలు లేని దుస్థితిని నివారించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇ ందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని సైతం వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. క్యాడ్‌వామ్ (కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, వాటర్ మేనేజ్‌మెంట్) పథకంలో భాగంగా రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల కు కేంద్రం సాయం చేయాలని ప్రభుత్వం అభ్యర్ధించింది. ఈ 11 ప్రా జెక్టుల పనులు పూర్తయితే 13 లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతు ంది. ప్రాజెక్టుల నుంచి విడుదలైన నీరు ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల ద్వారా నేరు గా పొలాలకు అందించడమే ఈ పథకం లక్షం.

ఇందుకోసం రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల కమాండ్ ఏరియా అభివృద్ధికి, కాలువల ఏర్పాటుకు రూ.1,489 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ప్రాజెక్టు అసలు నిర్మాణ వ్యయానికి ఇది అదనం. ఇప్పటికే ఎఐబిపి పథకం కింద రాష్ట్రంలోని 11 ప్రాజెక్టులకు కేంద్ర ం రూ.944 కోట్లు సాయం చేస్తుం ది. దశల వారీగా ఈ నిధులను వి డుదల చేస్తుండగా, ఈ ప్రాజెక్టుల పూర్తికి మొత్తంగా రూ.1,929 కో ట్లు వెచ్చించాల్సి ఉంది. క్యాడ్‌వా మ్ పథకంలో రాష్ట్రం ప్రతిపాదించిన 11 ప్రాజెక్టులకు రూ.68 లక్షలు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించగా, ఇదివరకే రూ.36.5 లక్షల సాయం అందింది. రాష్ట్రంలోని ఇందిరమ్మ వరద కాలువ, చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, రాజీవ్ భీమా ఎత్తిపోతల, శ్రీరాంసాగర్ రెండో దశ, నీల్వాయి, ర్యాలివాగు, మత్తడివాగు, కుమ్రం భీం, పాలెం వాగు, పెద్దవాగు (జగన్నాధపూర్) ప్రాజెక్టు, గొల్లవాగు ప్రాజెక్టులను క్యాడ్‌వామ్‌లో పొందుపరిచారు. ఇందులో గరిష్టంగా దేవాదుల పథకంలో ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుంది. ఆ తర్వాత ఇందిరమ్మ వరద కాలువ, భీమా ఎత్తిపోతల, శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టు ఉంది.

క్యాడ్‌వామ్ ప్రాజెక్టుల జాబితా
ప్రాజెక్టు ఆయకట్టు (ఎకరాలు) కేంద్రం వాటా రాష్ట్రం వాటా మొత్తం
1. ఇందిరమ్మ వరద కాలువ 2.33 లక్షలు 48.26 లక్షలు 48.97 లక్షలు 97.23 లక్షలు
2. చొక్కారావు దేవాదుల 6.2 లక్షలు 380.35 లక్షలు 379.59 లక్షలు 759.9 లక్షలు
3. రాజీవ్ భీమా ఎత్తిపోతల 2.05 లక్షలు 114.8 లక్షలు 130.4 లక్షలు 245.2 లక్షలు
4. శ్రీరాంసాగర్ రెండో దశ 1.82 లక్షలు 103.2 లక్షలు 100.84 లక్షలు 204.08 లక్షలు
5. నీల్వాయి ప్రాజెక్టు 13,150 9.15 లక్షలు 15.96 లక్షలు 25.12 లక్షలు
6. ర్యాలివాగు ప్రాజెక్టు 2570 2.30 లక్షలు 3.26 లక్షలు 5.57 లక్షలు
7. మత్తడివాగు ప్రాజెక్టు 8350 6.32 లక్షలు 6.30 లక్షలు 12.63 లక్షలు
8. కుమ్రం భీం ప్రాజెక్టు 24787 19.84 లక్షలు 40.38 లక్షలు 60.22 లక్షలు
9. పాలెం వాగు ప్రాజెక్టు 10250 2.60 లక్షలు 2.59 లక్షలు 5.20 లక్షలు
10. జగన్నాధపూర్ ప్రాజెక్టు 15182 12.20 లక్షలు 40.34 లక్షలు 52.54 లక్షలు
11. గొల్లవాగు ప్రాజెక్టు 9612 7.69 లక్షలు 12.70 లక్షలు 20.40 లక్షలు
మొత్తం 13,28,557 706.78 లక్షలు 781.44 లక్షలు 1488.22 లక్షలు

 

Help the Development of Canals

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆయకట్టుపై నజర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: