హెలీ టాక్సీలు

షేరింగ్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లు ..హెలికాప్టర్లను బుక్ చేసుకునే రోజులు వచ్చేశాయి. ట్రాఫిక్‌ను ఛేదించుకుని ఎయిర్‌పోర్ట్ట్‌కెళ్లి విమానాన్ని పట్టుకో వాలం టే… ఇంతకంటే మరో మార్గం ఉండదేమో. అందుకే నగరంలోని ఎయిర్‌పోర్ట్‌కు హెలీటాక్సీ పేరుతో హెరికాప్టర్ తిప్పుతోంది తంబీ ఏవియేషన్.. నగరాల్లో  ట్రాఫిక్‌ను తల్చుకుంటే భయమేస్తుంది. ఇంటి నుంచి బయటకువచ్చా మంటే గమ్యస్థానానికి చేరాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే.. ముఖ్యం గా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్యకు మార్గం […]

షేరింగ్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లు ..హెలికాప్టర్లను బుక్ చేసుకునే రోజులు వచ్చేశాయి. ట్రాఫిక్‌ను ఛేదించుకుని ఎయిర్‌పోర్ట్ట్‌కెళ్లి విమానాన్ని పట్టుకో వాలం టే… ఇంతకంటే మరో మార్గం ఉండదేమో. అందుకే నగరంలోని ఎయిర్‌పోర్ట్‌కు హెలీటాక్సీ పేరుతో హెరికాప్టర్ తిప్పుతోంది తంబీ ఏవియేషన్..

నగరాల్లో  ట్రాఫిక్‌ను తల్చుకుంటే భయమేస్తుంది. ఇంటి నుంచి బయటకువచ్చా మంటే గమ్యస్థానానికి చేరాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే.. ముఖ్యం గా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్యకు మార్గం కనుగొంది తంబీ ఏవియేషన్ కంపెనీ. అదే హెలీ టాక్సీలు. నగ రంలోని  ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌కు 60 కి.మీ ఉంటుం ది.  రోడ్డు మార్గంలో వెళ్లాలంటే రెండు గంటలు పడుతుంది.

ట్రాఫిక్ జామ్ అయి తే ప్రయాణం కేన్సిల్ చేసుకోవాల్సిందే. హెలీ టాక్సీల ద్వారా అరగంటలో ఎయి ర్‌పోర్ట్‌కు వెళ్లే అవకాశం దొరికింది బెంగళూరువాసులకు. ఆకాశమార్గంలో క్యాబ్ లను తీసుకొచ్చింది తంబీ యావియేషన్ కంపెనీ. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి అర గంటకోసారి షటిల్ సర్వీసులాంటిది.  ప్రయాణ ఖర్చు మూడువేలకు పైగానే ఉం టుంది. అసలీ ఐడియా ఎలా వచ్చిందంటే… కోల్గేట్ పామొలిన్ కంపెనీలో సేల్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న గోవింద్ నాయర్ ఓసారి బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు.  విమానం మిస్స య్యింది. అంతే అసహనంతో తండ్రికి ఫోన్ చేసి .. ఫ్లయిట్ మిస్సయ్యాను. అర్జెం టుగా హెలీకాఫ్టర్ పంపించు అన్నాడు చమత్కారంగా.  అలా పుట్టిన ఆలోచనా ఫలితమే తంబీ ఏవియేషన్.

Comments

comments