తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

Heavy rainsహైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటంతో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అయితే 28వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో వర్షాలు మరికొన్ని రోజులు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, హైదరాబాద్ తో పాటు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో శనివారం పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఎపిలోని కర్నూలు, ప్రకాశం కడప, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఒకటి నుంచి నాలుగు సెంటీమీటర్ల మేరకు వర్షం పడినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Heavy Rains To Hit Telugu States in Next 2 Days

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.