రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు

Rainsహైదరాబాద్: ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆదివారం రాత్రి, సోమవారం, మంగళవారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడురోజులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం అత్యధికంగా వరంగల్ అర్భన్ జిల్లాలో 87 మిల్లీమీటర్ల వర్షం కురవగా, రంగారెడ్డిలో 59.3 మి.మీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం వర్షం తాలుకూ వివరాలు…

ఉత్తర కోస్తా ఆంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 7.6 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన వర్షపాతం…

ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంభ గద్వాల (ఉండవెల్లి) 48 మి.మీలు హైదరాబాద్ (జూబ్లీహిల్స్) 31.5 మి.మీలు, నిర్మల్ (నర్సాపూర్) 25, ఆదిలాబాద్ (బోథ్) 42, సూర్యాపేట 38.5 మి.మీలు, ములుగు (వెంకటాపూర్) 30 మి.మీటర్లు, కుమరం భీం ఆసిఫాబాద్ (కేరమేరీ) 44, మంచిర్యాల 45, వనపర్తి (రేవెల్లి) 47 మి.మీటర్లు, నాగర్‌కర్నూల్ (తెలకపల్లి) 43మి.మీ, ఖమ్మం (కొణిజర్ల) 50 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం 22.3 మి.మీ, మహబూబాబాద్ (కేసముద్రం), 50, పెద్దపల్లి 20.8, ఆదిలాబాద్ (తాళ్లమడుగు) 45.3, సంగారెడ్డి (ఆంథోల్) 92మి.మీలు, కామారెడ్డి (దొమకొండ) 45.5 మి.మీలు, జగిత్యాల (జగిత్యాల) 36.8, మెదక్ (మెదక్) 51 యాదాద్రి భువనగిరి (రామన్నపేట) 42, వికారాబాద్ (బొమ్మాశిపేట) 45, వరంగల్ రూరల్ (రాయిపర్తి) 31.3, వరంగల్ అర్భన్ (వరంగల్) 87 మి.మీలు, రంగారెడ్డి (శేరిలింగంపల్లి) 59.3, నిజామాబాద్ (నందిపేట) 50 మి.మీలు, నల్లగొండ (కట్టంగూర్) 45, జయశంకర్ భూపాలపల్లి (రేగొండ) 48.5, రాజన్న సిరిసిల్ల (వీరంపల్లి) 46, మేడ్చల్ మల్కాజిగిరి (అల్వాల్) 57, నిజామాబాద్ (కమ్మరపల్లి) 51.5, సిద్ధిపేట (దుబ్బాక)40.3, కరీంనగర్ (హుజూరాబాద్) 49.8, మహబూబ్‌నగర్ 46, పెద్దపల్లి 41 మి.మీటర్లుగా నమోదయినట్టు అధికారులు తెలిపారు.

కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఆదివారం రాత్రి అనేక చోట్ల, సోమవారం చాలాచోట్ల, మంగళవారం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఆదివారం రాత్రి అనేక చోట్ల, సోమవారం చాలాచోట్ల, మంగళవారం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Heavy rains in Telangana for next three days

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.