రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల పాటు వర్షాలు

rains

హైదరాబాద్: రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కోమోరిన్ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల నుంచి 1.5 కి.మీల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ప్రధానంగా తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.ఆదిలాబాద్, వరంగల్, ఆసిఫాబాద్‌లతో పాటు ఉత్తర తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రలలో రెండురోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రెండురోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో చిత్తూరు జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Heavy rains in Telangana for next three days

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల పాటు వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.