బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..
రెండురోజుల పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rains in Telangana for next 2days

మనతెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీరాలను అనుకొని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు తిరిగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ గుజరాత్ నుంచి అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ ఛత్తీస్‌ఘడ్, విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరిత ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

దీంతో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు బుధవారం రాత్రి అనేకచోట్ల, నేడు చాలాచోట్ల, రేపు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ పట్టణం, వరంగల్ గ్రామీణం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rains in Telangana for next 2 days

The post బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.