దంచికొట్టింది…

  ఈదురుగాలులతో భారీ వర్షం… చెరువులను తలపించేలా రహదారులు గంటల తరబడి వర్షపునీటిలో వాహనదారులు.. తీవ్ర ఇబ్బందులు పలుచోట్ల రోడ్లపై కూలిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు మౌలాలిలో కూలిన చారిత్రక కమాన్ పైభాగం విద్యుత్ షాక్‌కుగురై యువకుడి మృతి అప్రమత్తమైన డిజాస్టర్ బృందాలు అబ్దులాపూర్‌మెట్‌లో అత్యధికంగా 47 మిమీ వర్షపాత నమోదు సిటీబ్యూరో : నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచడంతో చెట్లు నేలకొరిగాయి. జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, […] The post దంచికొట్టింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈదురుగాలులతో భారీ వర్షం…
చెరువులను తలపించేలా రహదారులు
గంటల తరబడి వర్షపునీటిలో వాహనదారులు.. తీవ్ర ఇబ్బందులు
పలుచోట్ల రోడ్లపై కూలిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
మౌలాలిలో కూలిన చారిత్రక కమాన్ పైభాగం
విద్యుత్ షాక్‌కుగురై యువకుడి మృతి
అప్రమత్తమైన డిజాస్టర్ బృందాలు
అబ్దులాపూర్‌మెట్‌లో అత్యధికంగా 47 మిమీ వర్షపాత నమోదు

సిటీబ్యూరో : నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచడంతో చెట్లు నేలకొరిగాయి. జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, సికింద్రాబాద్, బేగంపేట, చిక్కడపల్లి, రాంనగర్, ఉప్పల్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, సంతోష్‌నగర్, హయత్‌నగర్, అల్వాల్, ఈసీఐఎల్, తిరుమలగిరి, యాప్రాల్ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. కారణంగా రోడ్లలన్నీ చెరువులుగా తలపించాయి. గంటల తరబడి వాహనదారులు వర్షపు నీటిలో ఉండాల్సి వచ్చింది. జీహెచ్‌ఎంసీ ఇబ్బంది అక్కడకు చేరుకుని మ్యాన్‌హోల్ ద్వారా నీటిని పంపించారు. చెట్లు విరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై కూలినచెట్లను తొలగించారు. విద్యుత్‌ను వాన తగ్గిన తరువాత పునరుద్ధరించారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ విపత్తు నిర్వహణ అధికారులు పరిస్దితులను ఎప్పటికప్పుడు పరిశీలించి, వరద నీటిలో చిక్కుకున్నవారికి సేవలందించాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుంగా చెట్లు కూలితే వెంటనే వాటిని పక్కకు తొలగించాలన్నారు. మూసాపేటలో విద్యుత్ షాక్‌కు గురై కానిస్టేబుల్ కుమారుడు మృతిచెందాడు.

స్పందించిన జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు

ఆకస్మిక వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సకాలంలో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడంతో నగర ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చేయడంలో సఫలీకృతమైంది. కేవలం స్వల్ప వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇంజనీరింగ్, మాన్సున్ బృందాలు అప్రమత్తం చేశారు. ప్రధాన ప్రాంతాల్లో జెట్ డీవాటరింగ్ మిషన్లు ఏర్పాటు చేయడంతో రోడ్లపై నీరు వెంటనే తొలగింపజేశారు. డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ ద్వారా అందిన పలు ఫిర్యాదులను అత్యవసర బృందాలు పరిష్కరించాయి. అబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 5, చింతల్ బస్టాండ్ వద్ద, కుషాయిగూడ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం, లాలాపేట రామ్ థియేటర్, కుత్బులాపూర్ జయరాంనగర్, మియాపూర్ స్వర్ణపురికాలనీ, మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ క్రాస్‌రోడ్‌వద్ద చెట్టు కూలినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందాయి. మధురానగర్‌లో చెట్లుకూలి అక్కడ ఉన్న కారుపై పడటంతో ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయాన్ని రెస్కూ బృందాలు నివారించాయి. నేరెడ్‌మెట్ రాంబ్రహ్మనగర్, టౌలిచౌక్ మహ్మదీయ లేన్‌లో కూడా చెట్టు విరిగిపడ్డ సమాచారం అందింది. ఈఎస్‌ఐ వద్ద చెట్టుకూలి విద్యుత్ స్తంభంపై పడటంతో డిజాస్టర్ మేనేజ్‌మెంటు బృందాలు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి చెట్లను తొలగించాయి.

వర్షపాతం వివరాలు

అబ్దులాపూర్‌మెట్ 47.0మి.మీ
బీహెచ్‌ఇఎల్ 39.0మిమి
పటాన్‌చెరు 36.0మి.మి
కాప్రా 38.8మి.మి
ఉప్పల్ 25.5మి.మి
మల్కాజిగిరి 21.3మి.మి
కుత్బులాపూర్ 24.5మి.మి
కూకట్‌పల్లి 21.3 మి.మి
శేరిలింగంపల్లి 27.0మి.మి
ఖైరతాబాద్ 35.3మి.మి
ఆసిఫ్‌నగర్ 20.0మి.మి
సికింద్రాబాద్ 11.0మి.మి
బాలానగర్ 9.0మి.మి
షేక్‌పేట 8. 5మి.మి
ముషీరాబాద్ 7. 5మి.మి

Heavy Rain with Winds

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దంచికొట్టింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: