మేడారం జాతర ముగింపులో భారీ వర్షం..

మన తెలంగాణ/వరంగల్: మేడారం మహాజాతరలో శనివారం తల్లులు వనప్రవేశం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్రంలోని నలుదిశల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జాతరలో ఉన్న భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తల్లుల దర్శనానికి బారులు తీరారు. లక్షలాది సంఖ్యలో తల్లుల దర్శనం చేసుకుంటుండగానే మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అరగంట పాటు వర్షం కురుస్తున్నప్పటికి భక్తులు మాత్రం క్యూలైన్‌లోన వెళుతూ తల్లుల దర్శనాన్ని చేసుకున్నారు. భారీ వర్షానికి ముందు ఒక జల్లుగా వర్షం పడడంతో […] The post మేడారం జాతర ముగింపులో భారీ వర్షం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/వరంగల్: మేడారం మహాజాతరలో శనివారం తల్లులు వనప్రవేశం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్రంలోని నలుదిశల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జాతరలో ఉన్న భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తల్లుల దర్శనానికి బారులు తీరారు. లక్షలాది సంఖ్యలో తల్లుల దర్శనం చేసుకుంటుండగానే మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అరగంట పాటు వర్షం కురుస్తున్నప్పటికి భక్తులు మాత్రం క్యూలైన్‌లోన వెళుతూ తల్లుల దర్శనాన్ని చేసుకున్నారు. భారీ వర్షానికి ముందు ఒక జల్లుగా వర్షం పడడంతో సాధారణ వర్షపాతమేనని తల్లుల వనప్రవేశం చేసే ముందు జాతరను శుద్ధి చేయడానికి తగిన వర్షంగా భక్తులు భావించారు. గంట తరువాత భారీ వర్షం కురిసినప్పటికి భక్తులు ఆస్వాదిస్తూనే తల్లుల దర్శనం చేపట్టారు. భారీ వర్షంతో మేడారంలోని ప్రధాన రహదారులన్ని జలమయంగా మారాయి. వర్షం కురిసినా తల్లుల వనప్రవేశంపైనే భక్తులు, అధికారుల దృష్టి నిలిచిపోయింది. దీంతో రాత్రి 7 గంటలకు తల్లులను వనప్రవేశానికి తీసుకెళ్లే వరకు భక్తులు భారీ సంఖ్యలో దర్శనం చేసుకున్నారు.

Heavy Rain in Medaram Jatara on Saturday

The post మేడారం జాతర ముగింపులో భారీ వర్షం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: