చల్లబడిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం

rains

హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. నగరంలోని దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట్, సరూర్ నగర్, చంపాపేట్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్ లో వర్షం దంచికొడుతుంది. అటు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల నుంచి నగరవాసులకు ఉపశమనం లభించిందని వాతావరణ శాఖ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లోని మాన్సూన్ అత్యవసర బృందాలను జిహెచ్ఎంపి అప్రమత్తం చేసింది. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఇప్పటికే వాతావరణ కేంద్రం సూచించింది. వాతావరణ శాఖ సమాచారంతో క్షేత్రస్థాయిలో అప్రమత్తమైనట్టు అధికారులు తెలిపారు.

heavy rain in many areas in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చల్లబడిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.