తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్ : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, కర్నాటక మీదుగా తేమ గాలులు వీస్తున్నాయని, అంతేకాక ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో పిడుగులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోని మైదాన ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు చెప్పారు. ఇదిలా […] The post తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, కర్నాటక మీదుగా తేమ గాలులు వీస్తున్నాయని, అంతేకాక ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో పిడుగులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోని మైదాన ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పలు చోట్ల చిరు జల్లులు పడ్డాయి. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఉమ్మడి నల్గొండతో పాటు ఎపిలోని కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిశాయి. ఎండలు మండిపోతుండడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. పగలంతా ఎండలు, రాత్రి వేళల్లో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Heavy Rain Forecast For Telugu States

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: