ఎస్‌ఆర్‌ఎస్‌పికి భారీ వరద

SRSP

 

శనివారం నాడు 60వేల క్యూసెక్కుల నీరు రాక,

పూర్తిస్థాయి సామర్థం 1,091అడుగులు(90 టిఎంసిలు)

ప్రస్తుత మట్టం 1,077అడుగులు(44.9 టిఎంసిలు)

మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి శనివారం 69వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుంది. జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే దీనికి ప్రధాన కారణమని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టిఎంసిలు కాగా శనివారం సాయంత్రం నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 1077.50 అడుగులు, 44.950 టిఎంసిలుగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నుండి ఆవిరి రూపంలో 471 క్యూసెక్కులు, ప్రాజెక్టు గేట్ల నుండి 619 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నట్లు వారు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిమట్టం 1084.50 అడుగులు 65.294 టిఎంసిలుగా ఉంది. ఈ ఏడాది జూన్ 1 నుండి 39.371 టిఎంసిలుగా ఉంది.

Heavy flood to SRSP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎస్‌ఆర్‌ఎస్‌పికి భారీ వరద appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.