చేపలు తింటే ఈ సమస్యలు దూరం..!

  జలచరాలు ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే! అయితే వీటిని వారంలో రెండు లేదా మూడు సార్లు ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల మానసిక సమస్యలను దూరం చేసుకోవచ్చన్న విషయం ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 65 సంవత్సరాల వయస్సున్న మూడు వేల మంది రక్తనమూనాలను పరిశీలించారు నిపుణులు. వీరి రక్తంలో ఒమోగా 2 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించారు. సగం మంది డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారే! వీరికి […] The post చేపలు తింటే ఈ సమస్యలు దూరం..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జలచరాలు ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే! అయితే వీటిని వారంలో రెండు లేదా మూడు సార్లు ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల మానసిక సమస్యలను దూరం చేసుకోవచ్చన్న విషయం ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 65 సంవత్సరాల వయస్సున్న మూడు వేల మంది రక్తనమూనాలను పరిశీలించారు నిపుణులు. వీరి రక్తంలో ఒమోగా 2 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించారు. సగం మంది డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారే! వీరికి సుమారు మూడు వారాల పాటు చేపలు, రొయ్యలతో తయారు చేసిన పదార్థాలను వారంలో మూడుసార్లు అందించారు. అనంతరం వీరి ఆరోగ్యాన్ని పరిశీలించగా, 30 శాతం మందిలో డిప్రెషన్ తగ్గు ముఖం పట్టడాన్ని గమనించారు. కేవలం చేపలు, రొయ్యలు కలిగిన ఆహారాన్ని తరచూ తీసుకోవడం వల్లే ఇది సాధ్యం అయ్యిందన్న విషయాన్ని స్పష్టం చేశారు.

Health Problems Solving with Fish

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చేపలు తింటే ఈ సమస్యలు దూరం..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.