సంతోషం…మీచెంతే…!

 Happy

 

మనం సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు అది ఎవరిచేతుల్లోనో ఉంటుందనుకుంటాం. ఎదుటి వాళ్లు సంతోషపెడితేనే ఆనందించాలనుకోవడం తప్పంటున్నారు మానసిక నిపుణులు. ఈ ప్రపంచంలో ఏ శక్తిగానీ, వస్తువుగానీ మన సంతోషాన్ని ఆపలేదంటున్నారు. సంతోషమనేది మన ప్రవర్తన, పరిస్థితులను అర్థంచేసుకునే తీరు, వాటి ప్రతిస్పందనపై ఆధారపడివుంటుంది. కొంతవరకు ఇతరులతో మన అనుబంధాలు కూడా మనపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయంటున్నారు. మనం తెలివితో విచారాన్ని దూరం పెట్టి సంతోషాన్ని సొంతం చేసుకునే నిర్ణయాన్ని తీసుకోవాలి. అలా సంతోషాన్ని ఎన్నిక చేసుకునేందుకు సహకరించే, కొన్ని సులభమైన మార్గాలను తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది.

సంతోషాన్ని జీవిత లక్షాలతో మొదటిదానిగా చేసుకున్నప్పుడే దానిని అందుకోగలుగుతాం. ఈ లక్షాన్ని అందుకోవాలంటే ప్రాథమిక బాధ్యతను తమ మీదే వేసుకోవాలి. ఇతరుల కోసమో, అదృష్టం కోసమో, డబ్బు లేదా పిల్లలు, భార్య/భర్త కోసం వేచి చూడటం సరికాదు.

సంతోషానికే ప్రాధాన్యం: మనందరం కూడా విజయం సాధించటంవల్ల సంతోషం పొందగలమని భావిస్తాం. నిజమే, విజయం కొన్ని క్షణాలపాటు సంతోషాన్నిస్తుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనుష్యు లు, తమకు తర్వాత వచ్చే ప్రమోషన్ లేదా మంచి మార్కులు లేదా తదుపరి లక్షాన్ని ఛేదించటంతో ఆనందాన్ని ముడిపెట్టుకుంటారు. ఇలా చేయటంలో ఒక ప్రమాదం దాగి ఉంది. ఎప్పుడో జరిగే విషయాలకు సంతోషం ముడి పెట్టడంవల్ల అసంతృప్తి అంతర్లీనంగా కొనసాగుతూ ఉంటుంది. సంతోషం నిరంతరం వాయిదా పడుతుంది. అందుచేత, ఏదైనా సాధించిన ప్రతిసారీ అది ఎంత చిన్నదైనా లేదా పెద్దదైనా ఆ విజయాన్ని పండుగ చేసుకోవటం అవసరం.

పెద్దదే కానక్కర్లేదు: చిన్నవైనా, పెద్దవైనా మెరుపులా మెరిసి మాయమైనా సరే ప్రతి సంతోషాన్ని ఒడిసి పట్టుకోవాలి. కొన్నిసార్లు గతంలోని సంతోషకరమైన జ్ఞాపకాలను తిరిగి నెమరువేసుకోవటం కూడా సంతోషంలో భాగమే.
ఒకవేళ మీరు ఉద్యోగి అయివుంటే మీ ఆఫీసు బల్లమీద, ఓ మూల మీకు సంతోషాన్ని కలిగించే వాటిని ఉంచండి. సాధించిన విజయా లకు సంబంధించిన చిరు జ్ఞాపికలు ఉత్సాహాన్ని నింపే కొటేషన్లు, మీ పెదవు లపై చిరునవ్వు పూయించగలిగిన ఫొటోలు, మీ హాబీల తాలూకు విషయాలు మొదలైనవి అక్కడ ఉంచుకోండి. వీటిని చూస్తూ ఉంటే జీవితంలోని ప్రతిక్షణం ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు.
కానీ గత జీవితంలో కొని అద్భుత క్షణాలున్నాయని, భవిష్య త్తులో మరిన్ని సంతోషాలు తమకోసం ఎదురు చూస్తున్నాయన్న భరోసా కలిగి మనసు సంతోషంతో నిండుతుంది.
అలాగే భార్యాభర్తల నడుమ శృంగారం తరచూ అవసరమేనంటు న్నారు నిపుణులు. దీనివల్ల వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. బాంధ వ్యం మరింత ధృడంగా ఉండి, ఒకరిపట్ల ఒకరికి బాధ్యత పెరుగుతుంది. డిప్రె షన్, ఆందోళనవంటివి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మంచి నిద్రపడుతుంది. సంతోషానిచ్చే హార్మోన్లు విడుదలవుతా యి. ఇంకా అనేక రకాలసమస్యలు తగ్గుతాయన్నది నిపుణుల అభిప్రాయం.

ఒత్తిడిని జయించండి: కొన్ని అలవాట్లు మనలో ఒత్తిడిని పెంచుతాయి. ఒత్తిడి పెరిగి విచారంగా మారుతుంది. ఇటీవల పరిశోధనలో సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో రెండు గంటలకంటే ఎక్కువ సమయం గడిపే యువత మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నట్లు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ వాడేవాళ్ళు నిరంతరం సమాజం ప్రతిస్పందనలను గమనిస్తూ ఉండిపోతారు. దీని వల్ల మానసిక ఆరోగ్య సమస్యలైన ఆందోళన, కుంగుబాటు తొలగిపోతాయి. అలాకాకుండా అస్తమాటూ సోషల్‌మీడియానే పట్టుకుని ఉంటే సమయం వృథా అవడం ఖాయం. ఆ ప్రభావం మనపై మన పనిపై పడుతుంది. దీంతో అపరాధభా వం మొదలవుతుంది. అలాగే, మరీ అతిగా చిన్న పని ప్రణాళిక ప్రకారమే చేయాలనుకుంటే పట్టికలో ఉన్న పనిని ఒక్కటీ పూర్తి చేయలేకపోయినా మనల్ని అప్పడికప్పుడు అసంతృప్తి చుట్టుముడుతుంది.

లోపాలు ఎంచటమనేది మరో చెడ్డ గుణం. దానివల్ల జీవితంలో జరిగిన జరుగుతున్న చెడ్డ విషయాలే గుర్తుకు వస్తాయి. పూర్తిగా పద్ధతిగా ఉండాలి అను కోవటం కూడా అడ్డంకే. అంతా పద్ధతిగా జరగాలనుకునేవారు తాము సాధించిన విష యాలకు సంతోషపడలేరు. ఎక్కడో ఏదో లో పం కనిపిస్తుంది. దానివల్ల సంతోషంగా ఉండలేకపోతారు.
ప్రతి చిన్న విషయం పట్టించుకోవటం వల్ల విజయాన్ని సాధించినా సంతోషాన్ని దక్కిం చుకోలేరు. అందుచేత ఇలాంటి ఒత్తిడి కలి గించి, విచారానికి దారితీస్తే అలవాట్లను కాస్తంత దూరంగానే పెట్టాలి.

వ్యాయామం సరైన మార్గం: నడక, వ్యాయామం, ధ్యానం చేయటంవల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే సంతోషంగా ఉంటుంది. వ్యాయమాలను క్రమంతప్పకుండా కొనసా గించడంవల్ల అనేక ప్రయోజ నాలుంటాయన్నది తెలిసిన విషయ మే. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరాన్ని నాజూకు గా ఉంచడంలో వ్యాయామాల పాత్ర తిరుగులేనిది. వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, జిమ్‌లో ఏవో ఒక కసరత్తులు ఏవి చేసినా గొప్ప ఒత్తిడి నివారిణిగానే పనిచేస్తాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది.

ఎంతటి హుషారైనవారినైనా ఒత్తిడి అప్పు డప్పుడు కుదుపేస్తుంటుంది. ఒత్తిడి ప్రభా వం ఉన్నప్పుడు మెదడు చురుగ్గా ఉండదు. దీని నుంచి బయట పడేందుకు కొందరు అదే పనిగా టీ, కాఫీలు తాగేస్తుంటారు. కొందరు తీపి పదార్థాలు తింటుంటారు. ఇవేమి కాకుండా, ఒత్తిడిగా ఉన్నప్పుడు కొద్దిసేపు అటూ ఇటూ నడిచినా, మెట్లెక్కి దిగినా ఇట్టే తేడా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరం లో రక్త ప్రసరణ జరిగి ఒత్తిడి అదుపులోకి వస్తుంది.

సంతోషాన్ని పంచుకోండి: ఏ మాత్రం ఇబ్బంది, సమయం అక్కర్లేకుండా కూర్చున్న చోటు నుంచి లేచి ఓ ఐదు నిమిషాలు అటూ ఇటూ పచార్లుకొడితే ఒత్తిడి మాయం అవుతుంది.
నిరుత్సాహాన్ని కలిగించే సమస్యలు మనందరికీ వున్నాయి. కానీ ఇతర వ్యక్తులను కలిసినప్పుడు మీ సమస్యలు చెప్పి వారి గుండె బరువు పెంచకండి. మీ మనస్సులో బాధలను ఎదటి వారితో పంచుకుంటే గుండె తేలికపడవచ్చు. కానీ మీ బాధల కు పరి ష్కారాలు అందించలేనివారికి చెప్పి ఏమి ప్రయోజనం? ఇద్దరికీ ఉపయోగం ఉండదు.
ఎవరైనా మిమ్మల్ని వారంతట వారు ఎలా ఉన్నారు? అని పలుకరిస్తే మీ జీవితంలోని మంచి విషయాలను వారితో పంచుకోండి, దానివల్ల అందరూ మంచిగా సమయం గడపగలుగుతారు.
వారు తక్కువ మందైనా లేదా దూరంగా వున్నా సరే, అందరిలో సంతోషం వ్యాపిస్తుంది. ఇలా జీవితంలోని సంతోషకరమైనా క్షణా లను, మంచి విషయాలను ఇతరులతో పంచుకున్న ప్పుడు గుండెల్లో సంతోషం కెరటంలా అందరినీ ముంచెత్తుతుంది.

విజయం మీదే: సాధించే విషయాలకు మీరే కారణమని తెలుసుకోవాలి. చాలాసార్లు మనం ఇతరులు అందించిన సహాయానికి కృతజ్ఞత తెలుపుకుంటాం. కానీ మనలో ఎంతమంది తాము సాధించిన విజయాలకు, వెన్నుతట్టుకుని తమను తాము ‘శభాష్’ అని మెచ్చుకుంటారు. ఎంతో కష్టపడి ఆటంకాలను ఎదుర్కొని ముందడుగు వేశామని గ్రహిస్తారు. ఇ లా మనకు మనం అభినందిం చుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది.
సో..ఆనం దం, సంతోషం అనేవి ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటాయనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపో కూడదన్నమాట. సంతోషంగా ఉండటంతోపాటు ఇత రులనూ సంతోషపెట్టేందుకు ప్రయత్నించండి.

Health is Good if you are Happy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సంతోషం… మీచెంతే…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.