వర్షాకాలంతో జర పైలం

  రుతువు మారింది. చినుకులు మొదలయ్యాయి. ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేం. వాన నుంచి మనల్ని మనం రక్షించు కోవాలంటే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షపు ప్రభావం ముందుగా పడేది శరీరంపైనే. చర్మ సమస్యలు, అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, చుండ్రు, దురదలు, జలుబు, దగ్గులాంటివి వెంటబడతాయి. వీటన్నింటినుంచీ బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. సమస్యలు వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే రాకుండా రోగాలు రాకుండా చూసుకోమని చెబుతున్నారు.   1. ఇవి ఎప్పుడూ […] The post వర్షాకాలంతో జర పైలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రుతువు మారింది. చినుకులు మొదలయ్యాయి. ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేం. వాన నుంచి మనల్ని మనం రక్షించు కోవాలంటే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షపు ప్రభావం ముందుగా పడేది శరీరంపైనే. చర్మ సమస్యలు, అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, చుండ్రు, దురదలు, జలుబు, దగ్గులాంటివి వెంటబడతాయి. వీటన్నింటినుంచీ బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. సమస్యలు వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే రాకుండా రోగాలు రాకుండా చూసుకోమని చెబుతున్నారు.

 

1. ఇవి ఎప్పుడూ వెంట ఉండాలి..

1. మహిళల హ్యాండ్ బ్యాగ్‌లో గొడుగు తప్పనిసరిగా ఉండేలా పెట్టుకోవాలి. అదే బండిపై వెళ్లే వారైతే రెయిన్ కోట్ తప్ప నిసరిగా ఉంచుకోవాలి.
2. ఈ కాలంలో జలుబు, జ్వరాలతోటి నీటిలో తడిసి పాదాలు నాని, కాలివేళ్ల మధ్య ఒరిసిపోతాయి. అటువంటప్పుడు తప్పనిసరిగా నీటిలోకి వెళ్లాల్సివస్తే పాదాలకు లైట్‌గా గ్లిజరిన్ అప్లయ్ చేసుకుని వెళ్లాలి.
3. వేపనూనెను కాలివేళ్ల మధ్య రాస్తే ఒరుపులు తగ్గిపోతాయి.
4. తల తడిస్తే వెంటనే ఆరబెట్టుకోవాలి. లేకుంటే జలుబు చేయడమే కాకుండా జుట్టు రాలిపోతుంది.
5. కొబ్బరి నూనె వెచ్చబెట్టి తలకు మసాజ్ చేయాలి. దీనివల్ల జుట్టు కుదుళ్లు గట్టిపడటమే కాకుండా జలుబు చేయదు.
6. వేడినీళ్లలో యూకలిప్టస్ ఆయిల్ నాలుగు చుక్కలు కానీ యూకలిప్టస్ ఆకులు కానీ వేసి స్నానం చేస్తే జలుబు , జ్వరాలు రావు. ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి.
7. నువ్వుల నూనెతో వారానికోసారి అభ్యంగన స్నానం చేయండి.
8. వర్షాకాలంలో చుండ్రు బాధిస్తుంటుంది. కొబ్బరినూనెను వెచ్చబెట్టి తలకు మర్దనా చేసి, గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
9. తులసి ఆకు రసం, తేనె కలుపుకుని వర్షాకాలంలో అప్పుడప్పుడు తీసుకోవాలి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, జ్వరాలు రాకుండా ఉంటాయి.
10. ఈ కాలంలో కాటన్ దుస్తులు కాకుండా సిల్క్, షిఫాన్ వాడాలి. త్వరగా ఆరిపోతాయి.
11. జలుబు చేస్తే పంచదారను నిప్పుల మీద వేయండి. ఆ వచ్చే పొగను పీల్చండి. జలుబు తగ్గుముఖం పడుతుంది.
12. ఫేషియల్ చేయించుకోవాలంటే మసాజ్ చేయించుకుని స్టీమింగ్ తీసుకోండి. మేకప్‌కి వాడే సామగ్రి వాటర్‌ఫ్రూఫ్‌వి ఎంచుకోవాలి.

 

2. గ్రీన్ టీ తో క్లెన్సింగ్

1. చర్మ సంరక్షణలో ఎలాంటి అలర్జీలు రాకుండా చర్మం ప్రకాశవంతంగా ఉండాలంటే చెంచా బాదం నూనె, రెండు చుక్కల నిమ్మ నూనె కలిపి ముఖం, మెడకు మర్దన చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో చర్మం అతిగా పొడిబారదు. అదే సమయంలో జిడ్డుగానూ మారదు. కాబట్టి న్యూట్రల్ ప్యాక్ లను ఎంచుకుంటే మంచిది.

2. రెండు చెంచాల ఓట్స్ పొడిలో మూడు చుక్కల తేనె, నాలుగు చుక్కల ఆలివ్ లేదా విటమిన్ ‘ఇ’ నూనె, అరచెంచా టమాటా గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలయ్యాక మెల్లిగా రుద్దుతూ కడిగేసుకోవాలి. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ప్యాక్‌లా పనిచేయడమే కాదు. పేరుకొన్న దుమ్ము, ధూళి కూడా తొలగిపోయేలా చేస్తుంది. చర్మంపై ఫ్రీరాడికల్ ప్రభావాన్ని తగ్గించాలంటే శుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

3. గ్రీన్ టీతో క్లెన్సింగ్ చేసుకుంటే ఎంతో మార్పు కనిపిస్తుంది. అరకప్పు నీటిని తీసుకొని బాగా మరిగించి అందులో కొద్దిగా గ్రీన్ టీ పొడి వేయాలి. ఐదు నిమిషాల తర్వాత వడకట్టి అందులో అరచెంచా తేనె, ఐదు చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ నీటిలో దూదిని ముంచి ముఖంమంతా మృదువుగా రుద్దుకోవాలి. లేదంటే ఆ నీటిలో పలుచటి వస్త్రాన్ని ముంచి ముఖంపై ఐదు నిమిషాలు కప్పుకోవాలి. చర్మం
తాజాగా కనిపిస్తుంది.

4. చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత గ్రీన్ టీతో మళ్లీ ఒకసారి కడుక్కోవాలి. ఆ తర్వాత మళ్లీ శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రీన్ టీ యాస్ట్రిజెంట్‌గా పనిచేసి, చర్మానికి స్వాంతన ఇస్తుంది. అదే సమయంలో మొటిమలను కూడా నివారిస్తుంది. ముఖానికి రాసుకునే క్రీంలో బరకగా ఉండే గ్రీన్ టీ పౌడర్‌ను రెండు టీస్పూన్ల పరిమాణంలో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, చర్మంలోకి ఇంకిపోయే విధంగా వలయాకారంలో మర్దనా చేయాలి. కాసేపటి తరువాత కడిగేసుకుంటే, చర్మానికి మంచి తాజాదనాన్ని అందిస్తుంది.

5. కొద్దిగా ఓట్స్ పొడి తీసుకుని అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి. ఆ ర్వాత కొన్ని పాలు చేర్చి మెడ భాగానికి పూతలా వేసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ ఆ పూతను తొలగించేయాలి. దీనివల్ల మెడ కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పోషణ చేస్తే.. చర్మంలో సాగేగుణం పెరుగుతుంది. ఫలితంగా ముడతలు కనిపించవు. చర్మం కూడా బిగుతుగా మారుతుంది.

6. కళ్లు దురదపెట్టడం, ఎర్రబడటం వంటివి వర్షాకాలంలో సహజమే ఆ సమస్యల్ని నివారించాలంటే. కీరదోస రసం, క్యారెట్ రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని పదినిమిషాలయ్యాక తీసేయాలి. కళ్లు తాజాగా ఉంటాయి.

3. పాదాలను పట్టించుకోండి
వర్షాకాలంలో చాలామంది పాదాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. శరీరంలో ప్రధానంగా పాదాలు ఎక్కువగా మురికి బారిన పడుతున్నాయని గ్రహించాలి. లేకుంటే లెప్టోస్పిరోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి అంటువ్యాధుల బారినపడే అవకాశాలు పెరగడానికి దారితీస్తుంది. తరచుగా దుమ్ము, ధూళి, మురికి వంటివాటి నుంచి కాళ్లను శుభ్రపరుస్తూ ఉండాలి. కాలి వేళ్ల మధ్య పొడి టవల్ ఉపయోగించి పొడిగా ఉండేలా చూసుకోవాలి.

1. ఫంగల్ ఇన్ఫెక్షన్లను వదిలించుకోవడానికి పసుపు బాగా పనిచేస్తుంది. పసుపును ప్రభావిత ప్రాంతంలో నీటితో కలిపి పట్టించాలి. పొడిగా మారిన తర్వాత శుభ్రం చేయండి. త్వరలోనే మంచి ఫలితాలను చూడగలరు.

2. వేప ఆకులు పాదాల దుర్వాసనతో పోరాడటానికి పనికొస్తాయి. వేప ఆకులు, ఒక టీస్పూన్ పెప్పర్మింట్ ఆయిల్ వేసి కలిపిన వెచ్చని నీటిలో, పాదాలను 10 నుండి 20 నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. తర్వాత, పాదాలను శుభ్రంగా పొడిగా తుడిచిన తర్వాత టాల్కం పౌడర్ వేసి విశ్రాంతినివ్వాలి.

4. ఈ జాగ్రత్తలు పాటించండి
ఈ కాలంలో జలుబు త్వరగా అంటుకుంటుంది. సరైన జాగ్రత్తలు పాటించకపోతే అది ఇతరులకు వ్యాపిస్తుంది. జలుబు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. దగ్గినా, తుమ్మినా.. చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. కానీ అలా అడ్డుపెట్టుకున్నప్పుడల్లా సబ్బునీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే క్రిముల సమస్య ఉండదు.
2. అయితే చేతులపై దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్లు పడకుండా టిష్యూ వాడితే మరీ మంచిది. అలా వాడిన వాటిని ఎప్పటికప్పుడు పారేయాలి.
3. జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే.. అలాంటి సమస్య ఉన్నప్పుడు ముక్కు, నోరు, కళ్లను చేత్తో ముట్టుకోకపోవడమే మంచిది. మొటిమల సమస్య ఉన్నప్పుడు కూడా చేత్తో తాకడానికి ప్రయత్నించకూడదు.
4. ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసా తీసుకెళ్లాలి. అలాగే జలుబుతో బాధపడుతున్నవారు వాడే మంచినీళ్లసీసాను తీసుకోకపోవడమే మంచిది.
5. రోడ్డు పక్కన లభించే పదార్థాలను తినడం మానేయడమే మంచిది. వెంట శానిటైజర్‌ను కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.
6. ప్రతిరోజు కనీసం పదినిమిషాలు ఎండలో ఉంటే విటమిన్ డి అందుతుంది. ఇది ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. పరోక్షంగా శరీరం శక్తిమంతంగా తయారవుతుంది. అయితే.. ఉదయం ఏడుగంటల లోపల వచ్చే ఎండలో కూర్చుంటే అతినీల లోహిత కిరణాల ప్రభావం ఉండదు.
7.రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే వాటిని తినేముందు ఒకటికి రెండుసార్లు కడగడం మరవకూడదు.

Health care from impact Rainfall, Storms, Climate Change

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వర్షాకాలంతో జర పైలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: