యాలకులతో చక్కటి ప్రయోజనాలు

  సుగంధద్రవ్యాల్లో యాలకులదే ప్రథమ స్థానం. బతుకమ్మ, దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. అమ్మకు నైవేద్యంగా తయారుచేసే తీపి పదార్థాలలో తప్పనిసరిగా యాలకులను వేస్తూంటాం. వీటిలో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టం. యాలకుల్లో చాలా రకాలున్నాయి. జింగీబెరాసెయ్ జాతి మొక్కల నుంచీ లభిస్తాయి యాలకులు. ఇండియాతోపాటూ భూటాన్, నేపాల్, ఇండొనేసియాలో కూడా లభిస్తాయి. సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెప్పుకున్నే యాలకులు ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో మూడోవి. కుంకుమపువ్వు, వెనీలా మాత్రమే యాలకుల కంటే ఖరీదైనవి. యాలకుల్లో […] The post యాలకులతో చక్కటి ప్రయోజనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుగంధద్రవ్యాల్లో యాలకులదే ప్రథమ స్థానం. బతుకమ్మ, దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. అమ్మకు నైవేద్యంగా తయారుచేసే తీపి పదార్థాలలో తప్పనిసరిగా యాలకులను వేస్తూంటాం. వీటిలో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టం. యాలకుల్లో చాలా రకాలున్నాయి. జింగీబెరాసెయ్ జాతి మొక్కల నుంచీ లభిస్తాయి యాలకులు. ఇండియాతోపాటూ భూటాన్, నేపాల్, ఇండొనేసియాలో కూడా లభిస్తాయి. సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెప్పుకున్నే యాలకులు ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో మూడోవి. కుంకుమపువ్వు, వెనీలా మాత్రమే యాలకుల కంటే ఖరీదైనవి. యాలకుల్లో ప్రధానంగా గ్రీన్, బ్లాక్ అనే రెండు రకాలుంటాయి. ఎక్కువగా వాడే గ్రీన్ యాలకులు. ఇండియా, మలేసియాలో అధికంగా పండుతాయి. యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాదు. కాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకోగలవు. డిప్రెషన్ నుంచీ బయటపడాలంటే ఏ యాలకుల టీయో, పాలో తాగితే సరి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి : యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలున్నాయి. ఇవి జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తాయి. అలాగే కడుపులో మంట, నొప్పి వంటి వాటిని పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే బైల్ యాసిడ్‌ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి.

డిప్రెషన్‌కి సరైన మందు : ప్రతి రోజూ యాలకుల టీ తాగితే. చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. కుంగుబాటు ధోరణిని పోగొడుతాయి.

ఆస్తమాకి విరుగుడు : కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని క్రమంతప్పకుండా వాడాలి. ఇవి రక్త ప్రసరణను తేలిక చేసి ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. కఫాన్ని కూడా తగ్గిస్తాయి. గ్రీన్ యాలకుల్ని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని నయం చేయడానికి వాడతారు.

బీపీని తగ్గిస్తాయి : బీపీని తగ్గించేందుకు యాలకులు బాగా పనిచేస్తాయి. మనం వాడే సూప్స్, బేకింగ్ ఐటెమ్స్‌లో యాలకుల పొడి అందుకే వేస్తుంటారు. యాలకులు రక్తపోటును ఎక్కువా, తక్కువా కాకుండా చేస్తాయి.

కాన్సర్ రాకుండా : కాన్సర్‌ను సహజ సిద్ధంగా తగ్గించే గుణాలు యాలకులకు ఉన్నాయి. కాన్సర్‌ను అడ్డుకోవడం, అది వస్తే, త్వరగా పెరగకుండా చెయ్యగలగడం, ఒక్కోసారి కాన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా యాలకులకు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.

టెన్షన్‌ను పోగొట్టుతుంది : యాలకుల రుచి, సువాసన మనలో టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్, ఉద్రేకతలను తగ్గిస్తాయి. అందువల్ల ఒత్తిడిలో ఉన్నవారు టీ లేదా పాలలో యాలకుల పొడి వేసుకొని తాగితే మంచిది. యాలకుల గింజలు తిన్నా మంచిదే.

గుండెను కాపాడతాయి : యాలకుల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు గుండెకు మేలు చేస్తాయి. వీటిలోని ఫైబర్, ఇతర పోషకాలు. కొలెస్ట్రాల్ లెవెల్‌ను తగ్గిస్తాయి. గుండెకు చక్కగా రక్తం సరఫరా అయ్యేలా చేస్తాయి.

Health Benefits with Cardamom

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యాలకులతో చక్కటి ప్రయోజనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: