మేలు చేసే పుదీనా..!

ఘుమఘుమ వాసనలు వెదజల్లే పుదీనా మంచి రుచి ఆరోగ్య ప్రయోజనకారి కూడా. టీలో, పదార్థాల్లో, సలాడ్స్‌కు ఎంతో రుచి ఇస్తాయి. ఈ ఆకుల్ని ఏ పదార్థంలో కలిపినా అదనపు అసాధారణ ఫ్లేవర్ ఇస్తాయి. వివిధ వంటకాలు డ్రస్సింగ్‌ల సీజనింగ్స్‌కు పుదీనా ఆకులు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే అనేక టూత్‌పేస్ట్‌లు, చూయింగ్‌గమ్స్ బ్రీత్‌ప్రెషనర్లు, క్యాండీలు ఇన్‌హేలర్లలో పుదీనా ప్రధాన పదార్థం. ఈ ఆకులు గొప్ప ఎపటైజర్స్, క్లెన్సర్, జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. పుదీనాలో ఉండే మెంథల్ జీర్ణక్రియకు అవసరం […] The post మేలు చేసే పుదీనా..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఘుమఘుమ వాసనలు వెదజల్లే పుదీనా మంచి రుచి ఆరోగ్య ప్రయోజనకారి కూడా. టీలో, పదార్థాల్లో, సలాడ్స్‌కు ఎంతో రుచి ఇస్తాయి. ఈ ఆకుల్ని ఏ పదార్థంలో కలిపినా అదనపు అసాధారణ ఫ్లేవర్ ఇస్తాయి. వివిధ వంటకాలు డ్రస్సింగ్‌ల సీజనింగ్స్‌కు పుదీనా ఆకులు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే అనేక టూత్‌పేస్ట్‌లు, చూయింగ్‌గమ్స్ బ్రీత్‌ప్రెషనర్లు, క్యాండీలు ఇన్‌హేలర్లలో పుదీనా ప్రధాన పదార్థం. ఈ ఆకులు గొప్ప ఎపటైజర్స్, క్లెన్సర్, జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. పుదీనాలో ఉండే మెంథల్ జీర్ణక్రియకు అవసరం అయ్యే ఎంజైమ్‌లకు సహకరిస్తుంది.

ముక్కు దిబ్బడ, గొంతుబాధ, ఊపిరితిత్తులను క్లియర్ చేయటంలో పుదీనా ఘాటు వాసన అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆస్తమా రోగులకు మంచి రిలాక్సెంట్ మింట్ ఆయిల్ మంచి యాంటీసెప్టెక్, యాంటీ ఫ్యూరిటెక్ మెటీరియల్ కావటం వల్ల పుదీనా రసం అద్భుతమైన స్కిన్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మొటిమలు మచ్చల్ని తొలగించగలుగుతుంది. పుదీనా ఆహారంలో భాగంగా ఉంటే శరీరంలోని అదనపు కొవ్వు వినియోగంలోకి వస్తుంది. శరీరంలో బరువు పేరుకోదు.

పుదీనా మంచి నొప్పుల నివారిణి.

పెయిన్‌బామ్స్‌లో ప్రధాన పదార్థంగా వాడతారు. అందుకే ఈ పెయిన్ బామ్స్ ఉపయోగించగానే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. పుదీనాలో కాల్షియం, ఫాస్పరస్ విటమిన్‌సి, డి,ఇ కొద్ది మోతాదులో బి కాంప్లెక్స్ లభిస్తుంది. ఇవన్నీ కలసి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

వేడి టీలో పుదీనా ఆకులు వేస్తే టీకి కమ్మని వాసన రుచి వస్తాయి. పుదీనా తాజా ఐస్ పానీయం కూడా. సాదా ఐస్డ్ టీలో పుదీనా వేసి అరగంట ఆగాక తాగచ్చు. ఏ కూరల్లో అయినా పుదీనా వేస్తే రుచి పెరుగుతోంది. చాలా తేలిగ్గా మింట్ సూప్ తయారుచేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ అల్లం, వెల్లుల్లి, పాలు, మిరియాల పొడితో మంచి సూప్ తయారు చేసుకోవచ్చు. అలాగే పుదీనాని పైనాపిల్, మామిడి, నిమ్మ, నారింజ జ్యూస్‌ల్లో కలుపుకోవచ్చు. పుదీనాలో ఉండే పసందైన రుచి దాన్ని ఏ పదార్థంలో అయినా తేలిగ్గా కలిసిపోయేలా చేస్తుంది. ఈ వేసవిలో చేసుకొనే ప్రతి చల్లని పానీయంలోనూ పుదీనాను నిరభ్యంతరంగా కలుపుకోవచ్చు. ఆరోగ్యంతో పాటు రుచికూడా సొంతం.

Health Benefits of Mint

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మేలు చేసే పుదీనా..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.