రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది

Guava

 

ఈ సీజన్‌లో తినదగ్గ పండ్లలో జామ ఒకటి. తీయగా, ఎక్కువ పీచుతో ఆకుపచ్చ, పసుపు రంగులో నోరూరించే జామ ఆరోగ్యప్రదాయిని కూడా. జామ ఆకులతో హెర్బల్ టీ చేసుకొని తాగితే రక్తంలో చక్కెర నిల్వలు సాధారణ స్థాయికి వస్తాయి. పోషకవిలువలతో కూడిన జామతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమంటే.

జామలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, లైకోపిన్ ప్రొటీన్ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. ఈ పండులోని పొటాషియం, సోడియం రక్తపీడనాన్ని అదుపులో ఉంచుతాయి. అంతేకాదు చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తికి దోహదపడతాయి. దాంతో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వీటి ఆకుల కషాయం తాగితే మహిళల్లో నెలసరి సమయంలో కడుపు నొప్పి, వికారం వంటివి తగ్గిపోతాయి. దీనిలోని విటమిన్ సి, లైకోపిన్, క్వెర్‌సెటిన్ వంటి పాలీఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి పురుషుల్లో ప్రొస్టేట్ కేన్సర్, మహిళల్లో రొమ్ము కేన్సర్‌ను నివారిస్తాయి. దీనిలోని మాంగనీసు ఆహారంలోని ఇతర పోషకాలను గ్రహించేందుకు సమకరిస్తుంది. ఎనభై శాతం నీటితో నిండిన ఈ పండు చర్మం నీటిని కోల్పోకుండా చేస్తుంది.

 

Health Benefits of Guava

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.