కొబ్బరితో కొండంత బలం

coconut waterభారతదేశంలో కొబ్బరి బోండానికి ఉన్న ప్రాముఖ్యత ఇంతా అంతా కాదు. కొబ్బరి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి, మిక్చర్ పక్కకి కొబ్బరి బర్ఫీ, తలకు కొబ్బరినూనె, శీతలానికి కొబ్బరి బొండాం… ఇలా మన నిత్యజీవితంలో కొబ్బరి పాత్ర ఎంతోఉంది. నిన్న మొన్నటి దాకా కొబ్బరి రుచులు నిజంగానే పరిమితం! అమ్మమ్మల వంటదినుసుగా సంప్రదాయ ముద్ర నుంచి మెల్ల మెల్లగా బయటపడుతోంది. ఐస్‌క్రీముల నుంచి సౌందర్య సాధనాల వరకు అన్నింట్లోనూ కొబ్బరే.

కొబ్బరి నూనె : గతంలో స్నానానికి ముందుగా శుభ్రంగా కొబ్బరి నూనెతో ఒళ్లంతా మర్దనా చేసుకునేవాళ్లు. ఇప్పుడు అంతటి ఓపికా, తీరికా ఎవరికీ ఉండటం లేదు. కొబ్బరినూనె మృత కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
‘ బరువు’ తగ్గేందుకు… కొబ్బరిలో పోషకాలు ఎక్కువ. క్యాలరీలూ, కారోహైడ్రేట్లూ తక్కువ. అందుకే, ఊబకాయ చికిత్సలోనూ కొబ్బరిని ఉపయోగిస్తున్నారు.

కోకో మిల్క్: కేరళ వంటల్లో కొబ్బరిపాలు పడాల్సిందే. మెల్లమెల్లగా… యూట్యూబ్ పుణ్యమాని ప్రపంచమంతా ఓ పెద్ద వంటిల్లులా మారిపోయిందిప్పుడు. దీంతో తెలుగింటి గృహిణులు కూడా…కేరళ రుచుల్ని అలవోకగా వండేస్తున్నారు.

సౌందర్య సాధనాలు: శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది కొబ్బరి నూనె. అప్పుడు అమ్మాయిలకు తైల మర్దనా చేసేవారు, జిడ్డు పడుతుందని మొరపెడుతున్నా వదలకుండా.. జడలు వేసేవారు. కాబట్టి కురులు నేలను తాకేవి, ఒత్తుగా నల్లగా ఉండేది. కాలం మారుతున్న కొద్దీ … కొబ్బరి నూనె రాసుకునేవారి సంఖ్య తగ్గిపోయింది. కాస్మోటిక్స్ వాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఫెయిర్‌నెస్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ ముఖారవిందాన్నీ, చర్మ సౌందర్యరాన్నీ రెట్టింపు చేస్తున్నాయి. జిడ్డులేని కొబ్బరి నూనెలూ వస్తున్నాయి. వీటిని వాడేందుకు యువత కూడా ఆసక్తి చూపుతోంది.

కోకో ఐస్ క్రీమ్స్: క్రీమ్ అభిమానులకు ఇది శుభ వార్తే. భారతీయులు స్వతహాగా కొబ్బరి ప్రియులు. లేతలేత కొబ్బరి వాసన తగలగానే నోరూరుతుంది! కాబట్టే, ఐస్‌క్రీమ్ తయారీ దారులు… కొబ్బరి రుచులతోనూ ఓ కొత్త ఐస్‌క్రీమ్‌ను అందిస్తున్నారు. వెనీలా, బట్టర్ స్కాచ్ వంటివి తినీ తినీ విసుగెత్తిపోయినవారికి, సరికొత్త అనుభూతిని అందిస్తోంది.

కమ్మని కొబ్బరి తేనె: కొబ్బరి అంటేనే కమ్మని రుచి! దానికి తేనె కూడా తోడయితేనే…అమృతమే! సహజ సిద్ధంగా ఎక్కడా కొబ్బరి తేనె దొరకదు. అయితేనేం, కొబ్బరి నూనెను బాగా వేడిచేసి, అందులో ఎండు కొబ్బరి పొడిని కుమ్మరించి తేనెలాంటి పదార్ధాన్ని తయారు చేస్తున్నారు. ఈ తేనెకు మంచి మార్కెట్ ఉంది.

కోకో చక్కెర : చెరుకుతో చేసిన చక్కెర వల్ల మధుమేహ స్థాయి పెరిగిపోయి, ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అదే, కోకో షుగర్ అయితే, పెద్దగా ఇబ్బందులేమీ ఉండదని చెబుతున్నారు.

కో అంటే కొబ్బరి పిండి: కార్న్‌ఫ్లోర్,శనగపిండి,గోధుమ పిండి… ఈ వరసలో చేరిన సరికొత్త పదార్థం కొబ్బరి పిండి. నూనె తీసేసిన తర్వాత మిగిలే కొబ్బరితో తయారు చేసే ఈ కోకో ఫ్లోర్ పిండివంటల తయారీలో ఉపయోగపడుతుంది.

health benefits of coconut water

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొబ్బరితో కొండంత బలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.