రాగి, ఇత్తడి పాత్రల్లో..!

  పూర్వం మన పెద్దవాళ్లు రాగి, ఇత్తడి వస్తువులనే ఎక్కువగా వాడేవారు. కానీ, ఇప్పుడయితే అంతా ప్లాస్టిక్‌మయం. దీంతో వారు ఇప్పటికీ అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పొచ్చు. అందువల్ల మనం కూడా రాగి, ఇత్తడి పాత్రలను వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చు. రాగి పాత్రలో కేవలం 3 గంటల పాటు నీటిని నిల్వ ఉంచితే చాలు. ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు పరిశుభ్రంగా మారుతుంది. రాగి పాత్రలతో నీటిని నిల్వ […]

 

పూర్వం మన పెద్దవాళ్లు రాగి, ఇత్తడి వస్తువులనే ఎక్కువగా వాడేవారు. కానీ, ఇప్పుడయితే అంతా ప్లాస్టిక్‌మయం. దీంతో వారు ఇప్పటికీ అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పొచ్చు. అందువల్ల మనం కూడా రాగి, ఇత్తడి పాత్రలను వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చు.

రాగి పాత్రలో కేవలం 3 గంటల పాటు నీటిని నిల్వ ఉంచితే చాలు. ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు పరిశుభ్రంగా మారుతుంది. రాగి పాత్రలతో నీటిని నిల్వ ఉంచడం వల్ల ప్రమాదకరమైన ఈ- కొలి బ్యాక్టీరియా కూడా అంతమవుతుంది. దీని వల్ల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఇత్తడి పాత్రలను జింక్, అలాయ్ మిశ్రమంతో తయారు చేస్తారు. జింక్ వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకని ఇత్తడి పాత్రల్లో అయినా నీటిని తాగవచ్చు. లేదా ఆ పాత్రల్లో వంట చేసుకుని తినవచ్చు.

రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల అసిడిటీ, అజీర్ణం, డయేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రావు. క్యాన్సర్ కణాలు నశిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. రక్తహీనత సమస్య ఉండదు. హైబీపీ తగ్గుతుంది.

Health Benefits from using copper and brass bowls

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: