కానిస్టేబుల్ ఆత్మహత్య…

Head-constableనిజామాబాద్: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో హెడ్‌కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్‌రెడ్డి, ఎస్‌ఐ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తక్షణమే అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రకాశ్ రెడ్డి మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. పిఎస్ లో ఎవరూ లేని సమయంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రకాశ్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయట ఉన్న తోటి సిబ్బంది శబ్దం విని లోపలికి వచ్చే సరికి రక్తపు మడుగులో పడిఉన్నాడు. ఓ కేసు విషయంలో ఎస్సైతో ప్రకాశ్ రెడ్డికి వాగ్వాదం జరిగినట్లుగా స్టేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఆత్మాహత్యాయత్నానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

Head Constable Commits Suicide in Nizamabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కానిస్టేబుల్ ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.