హెచ్‌డిఎఫ్‌సి లాభం 27 శాతం జంప్

  న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి త్రైమాసికానికి హెచ్‌డిఎఫ్‌సి నికర లాభం రూ. 2861.6 కోట్లతో 27 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.2256.68 కోట్లుగా ఉంది. ప్రతి ఈక్విటీ షేరుకు రూ.17.50 తుది డివిడెండ్‌ను బోర్డు డైరెక్టర్లు సిఫారసు చేశారు. కంపెనీ రెవెన్యూ రూ. 11587 కోట్లతో 24 శాతం పెరిగింది. కంపెనీ కొత్త అకౌంటింగ్ ప్రమాణాలకు మారినందున ఈ ఫలితాలను గత ఫలితాలతో పోల్చలేము. కంపెనీ స్థూల […] The post హెచ్‌డిఎఫ్‌సి లాభం 27 శాతం జంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి త్రైమాసికానికి హెచ్‌డిఎఫ్‌సి నికర లాభం రూ. 2861.6 కోట్లతో 27 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.2256.68 కోట్లుగా ఉంది. ప్రతి ఈక్విటీ షేరుకు రూ.17.50 తుది డివిడెండ్‌ను బోర్డు డైరెక్టర్లు సిఫారసు చేశారు. కంపెనీ రెవెన్యూ రూ. 11587 కోట్లతో 24 శాతం పెరిగింది. కంపెనీ కొత్త అకౌంటింగ్ ప్రమాణాలకు మారినందున ఈ ఫలితాలను గత ఫలితాలతో పోల్చలేము. కంపెనీ స్థూల ఎన్‌పిఎలు 1.22 శాతం నుంచి 1.18 శాతానికి దిగివచ్చాయి. క్యూ4లో కంపెనీ ఎన్‌ఐఐ 6 శాతం పెరిగి రూ. 3183. 3 కోట్లకు చేరింది. రుణ వృద్ధి 13.8 శాతం వృద్ధి సాధించింది. నికర వడ్డీ మార్జిన్లు మాత్రం 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో షేరు విలువ స్వల్పంగా నష్టపోయి రూ.2,287 వద్ద ముగిసింది.

HDFC Q4 net jumps 27%, announces 17.50 share dividend

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హెచ్‌డిఎఫ్‌సి లాభం 27 శాతం జంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: