రూట్ల ప్రైవేటీకరణపై సర్కారుకు హైకోర్టు ఆదేశం

High Court

 

హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి ప్రైవేటీకరణ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారం వరకు ఆర్‌టిసి 5,100 రూట్ల ప్రైవేటీకరణపై నిర్ణయంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్‌ఆర్‌టిసిలో ప్రైవేటు బస్సులకు అనుమతిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెజస ఉపాధ్యక్షుడు పి.ఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విషయంలో మంత్రివర్గ తీసుకున్న నిర్ణయాలను తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని అదనపు అడ్వకేట్ జనరల్ ను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఈక్రమంలో రాష్ట్ర కేబినెట్ ప్రొసీడింగ్‌లను తమ ముందు ఉంచాలని హైకోర్టు కోరింది. తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని నిలిపివేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరడంతో ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే రోజు ఆర్‌టిసి సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదలకు సంబంధించి కూడా హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆర్‌టిసి సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్‌టిసి ప్రైవేటీకరణకు సంబంధించిన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు కార్మికులతో చర్చలు జరపాలని మరోసారి ప్రభుత్వానికి సూచించింది. అధికారులు సమర్పించిన లెక్కలు గజిబిజిగా ఉన్నాయని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వం ప్రజల పట్ల చూపాల్సింది అధికారం కాదని, ఔదార్యం చూపాలని హైకోర్టు సూచించింది.

HC stays KCR cabinet decision to privatize 5100 routes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూట్ల ప్రైవేటీకరణపై సర్కారుకు హైకోర్టు ఆదేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.